Home » Makar Sankranti
Sankranti 2025: తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300 కు పైగా బరులు ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు పందాలు, గుండాట జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
Sankranti 2025: తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కొత్త పంటలతో ప్రతీ ఇళ్లూ ధన ధాన్యాలతో కళకళలాడుతుందన్నారు. ఆంధ్రులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. తెలంగాణలో పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా జరుపుకుంటున్నామన్నారు.
Sankranti 2025: బాపట్ల జిల్లా వేమూరులో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.
Sankranti 2025: ఆకాశం రంగుల మయం అయిందా అన్నట్లుగా గాలిలో పతంగులు ఎగురుతూ కనిపిస్తుంటాయి. బిల్డింగ్‌పైకి ఎక్కి యువత కైట్స్‌ను ఎగురవేస్తుంటారు. మార్కెట్‌లో దొరికే వివిధ రకాల గాలిపటాలను తీసుకువచ్చి పోటాపోటాగా పతంగులు ఎగురవేస్తుంటారు యువత. ఎక్కడికక్కడ భవనాలపై డీజే సౌండ్లతో.. యువత కేకలతో దద్దరిల్లి పోతుంది.
Sankranti 2025: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు చోట్ల కైట్స్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని పతంగులు ఎగురవేస్తారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలిపటాలను ఎగురవేస్తారు. వివిధ రకాల పతంగులు ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్నాయి. ఇక చిన్న పిల్లల జోష్ మామూలుగా ఉండదు.
Bhogi Festival: భోగి పండుగ రోజు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి సమయంలో కొత్త పంట రావడంతో పొలాల నుంచి క్రిమి కీటకాలు ఇళ్లలోకి వస్తాయి. భోగి మంటలు వేయడంతో అవి ఇళ్లలోకి రావు. అలాగే సాయంకాలం చిన్నారులపై భోగి పళ్లు పోస్తారు.
ముగ్గులు, హరిదాసులు, పతంగులు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు.. ఇలా సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఫెస్టివల్ వచ్చేసింది.
సింగపూర్‌లో కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు.
పండగలు, ప్రత్యేక రోజులు వస్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. మద్యం అమ్మ కాలను పెంచడమే లక్ష్యంగా దుకాణాల సమయవేళలను..
శబరిమల (Sabarimala)లో భక్తులకు మకరజ్యోతి (Makara Jyothi) దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప...