ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: చేతులారా పెళ్లి చెడగొట్టుకున్న వరుడు.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:30 PM

కాసేపట్లో పెళ్లి అనగా వరుడు తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగి రచ్చరచ్చ చేసిందుకు పెళ్లి చెడగొట్టుకున్నాడు. అతడి తీరు చూసి తిక్కరేగిన వరుడి కుటుంబం అప్పటికప్పుడు పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిలో ఇష్టారీతిన ప్రవర్తించిన ఓ వరుడికి వధువు తల్లి ఊహించని షాకిచ్చింది. అతడి తీరుతో షాకైపోయిన ఆమె అప్పటికప్పుడు పెళ్లిని రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా వధువు తల్లి చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. వరుడికి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పించారంటూ అనేక మంది ప్రశంసలు కురిపించారు (Viral).

బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉంటున్న ఓ జంట వివాహం అంగరంగ వైభవంగా సాగుతోంది. అయితే, మద్యం వ్యసనం కారణంగానో లేదా స్నేహితుడి ఒత్తిడి వల్లనో తెలీదు కానీ వరుడు పూర్తిగా తాగి మండపానికి వచ్చాడు. మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి నానా రచ్చ చేశాడు.


Viral: భారతీయ గురువు ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్థానీ సివిల్స్‌కు ప్రిపరేషన్!

ఇదంతా చూసి వధువు కుటుంబం షాకైపోయింది. తన కూతురి భవిష్యత్తు ఏమైపోతుందో అన్న బెంగ వధువు తల్లికి కలిగింది. దీంతో, ఊహించని విధంగా ఈ పెళ్లి జరిగేదే లేదంటూ వరుడి కుటుంబానికి తెగేసి చెప్పింది. దీంతో, పెళ్లికొచ్చిన బంధువులంతా ఒక్కసారిగా షాకైపోయారు.

వరుడి కుటుంబాన్ని చేతులు జోడించి వేడుకుంటూ ఆమె పెళ్లి రద్దు చేసుకున్నట్టు తేల్చి చెప్పింది. తన కూతురి భవిష్యత్తు తలుచుకుంటేనే బెంగ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. వరుడి కుటుంబం ఆమెకు నచ్చ చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఆమె ససేమిరా అనడంతో చివరకు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది.

Viral: చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకపోయినా ఇన్ఫోసిస్‌ ఉద్యోగానికి టెకీ రాజీనామా! కారణం ఏంటంటే...


కాగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే చూసి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ తల్లిగా ఆమె చేసిన పని సబబే అని అంటున్నారు. పరువు కోసం పెళ్లి జరిపించి ఉంటే వధువు జీవితం నాశనం అయ్యి ఉండేదని అన్నారు. పెళ్లి రోజైనా తాగ కుండా ఉండలేని వాడికిచ్చి వధువు జీవితం నాశనం చేయకూడదని అన్నారు. కొన్ని రోజుల పాటు వధువును ఆమె తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు ఏకంగా 17 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి.

Viral: నన్ను తదేకంగా చూడటం నా భార్యకు ఇష్టమే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ చురక

Read Latest and Viral News

Updated Date - Jan 13 , 2025 | 05:33 PM