Electricity Bill: కరెంట్ బిల్లు చూసి షాక్.. ఏకంగా రూ.200 కోట్లు రావడంతో యజమాని పరిస్థితి ఏంటంటే..
ABN , Publish Date - Jan 10 , 2025 | 09:00 PM
హోటల్స్, ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి వాటి వాడకాన్ని బట్టి లక్షల్లో కరెంట్ బిల్లు వస్తుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి ఇంటికి ఒక నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.200 కోట్లు వచ్చింది. ఆ బిల్లు చూసిన ఇంటి యజమాని షాకయ్యాడు. వెంటనే సంబంధిత ఎలక్ట్రిసిటీ బోర్డును సంప్రదించాడు.
సాధారణంగా ఏ ఇంటికైనా కరెంట్ బిల్లు (Electricity Bill) ఎంత వస్తుంది. సగటు మధ్య తరగతి కుటుంబాల వారు నెలకు రూ.1000 నుంచి రెండు వేల వరకు కరెంట్ బిల్లు చెల్లిస్తారు. విద్యుత్తు ఉపకరణాలు ఎంత ఎక్కువగా ఉన్నా రూ.10 వేల నుంచి 20 వేల వరకు రావచ్చు. ఇక, హోటల్స్, ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి వాటి వాడకాన్ని బట్టి లక్షల్లో కరెంట్ బిల్లు వస్తుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి ఇంటికి ఒక నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.200 కోట్లు వచ్చింది (electricity bill of Rs 2 billion). ఆ బిల్లు చూసిన ఇంటి యజమాని షాకయ్యాడు. వెంటనే సంబంధిత ఎలక్ట్రిసిటీ బోర్డును సంప్రదించాడు (Viral News).
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని హమీర్‌పూర్ జిల్లాకు చెందిన లలిత్ ధీమాన్ అనే వ్యక్తి చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. అతడికి స్వంత ఇల్లు ఉంది. అతడికి ప్రతీనెలా రూ.2 వేలకు అటు ఇటుగా కరెంట్ బిల్లు వస్తుంటుంది. గత నవంబర్ నెలలో అతడు రూ.2,500 కరెంట్ బిల్లు చెల్లించాడు. అయితే తాజా డిసెంబర్ బిల్లు మాత్రం అతడికి షాకిచ్చింది. చలిలో కూడా చెమటలు పట్టించింది. ఎందుకంటే అతడికి డిసెంబర్ నెల వాడకానికి సంబంధించి వచ్చిన కరెంట్ బిల్లు అక్షరాలా 210,42,08, 405 కోట్ల రూపాయలు. అంటే ఒక నెల కరెంట్ బిల్లు రెండు వందల కోట్ల పైచిలుకు అన్నమాట. ఇన్ని కోట్ల బిల్లు రావడంతో లలిత్ వెంటనే కరెంట్ బోర్డు ఆఫీస్‌కు బిల్లు పట్టుకుని పరుగు తీశాడు.
కరెంట్ ఆఫీస్‌లోని అధికారులు కూడా ఆ బిల్లు చూసి షాకయ్యారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ పూర్తి చేసి అది సాంకేతిక లోపం కారణంగా జరిగిందని తెలుసుకున్నారు. డిసెంబర్ నెల కరెంట్ బిల్లును రూ.4,047గా నిర్ధారించి మరో బిల్లు చేతిలో పెట్టారు. దీంతో లలిత్ కాస్త ఉపశమనం పొంది ఇంటి దారిపట్టాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే ఒక ఇంటికి రెండు వందల కోట్ల బిల్లు రావడం మాత్రం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి..
Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..
Viral Video: ఏనుగును చూసి కుక్క మొరిగితే ఏమవుతుంది? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
Starbucks: స్టార్‌బక్స్ లోగో ఏంటో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి