Viral News: కొంప ముంచిన పిల్లి.. చైనా మహిళ ఉద్యోగం ఊడింది.. బోనస్ పోయింది..
ABN , Publish Date - Jan 22 , 2025 | 03:24 PM
పెంపుడు పిల్లి చేసిన నిర్వాకం వల్ల చైనా కు చెందిన ఓ మహిళ జీవితం తల్లకిందులైంది. ఆ మహిళ త్వరలో అందుకోవాల్సిన బోనస్‌ను చేజార్చుకుంది. ఏకంగా తన ఉద్యోగాన్నే కోల్పోయింది. చైనాలోని చాంగ్‌క్వింగ్ ప్రావిన్స్‌కు చెందిన 25 ఏళ్ల యువతికి పిల్లులంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో ఏకంగా తొమ్మిది పెంపుడు పిల్లులు ఉన్నాయి.

చైనా (China)లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెంపుడు పిల్లి (Pet Cat) చేసిన నిర్వాకం వల్ల చైనాకు చెందిన ఓ మహిళ జీవితం తల్లకిందులైంది. ఆ మహిళ త్వరలో అందుకోవాల్సిన బోనస్ (Bonus)ను చేజార్చుకుంది. ఏకంగా తన ఉద్యోగాన్నే కోల్పోయింది (Lost Job). చైనాలోని చాంగ్‌క్వింగ్ ప్రావిన్స్‌కు చెందిన 25 ఏళ్ల యువతికి పిల్లులంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో ఏకంగా తొమ్మిది పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఆమె ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఉద్యోగ జీవితంలో అసంతృప్తి మొదలైంది. సంస్థకు రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది (Viral News).
తను పని చేస్తున్న సంస్థకు రిజైన్ చేయాలనుకుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసింది. రిజైన్ లెటర్ టైప్ చేసి మెయిల్ చేయాలనుకుంది. అయితే వేరే ఎక్కడా ఉద్యోగం దొరికే అవకాశం లేకపోవడంతో ఆమె ఆ మెయిల్‌ను పంపించకుండా దానిని డ్రాఫ్ట్ చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె పెంపుడు పిల్లి నేరుగా ల్యాప్‌టాప్ కీబోర్డ్ మీదకు దూకడంతో అనుకోకుండా ఆ మెయిల్ సంస్థ హెచ్‌ఆర్‌కు వెళ్లిపోయింది. ఆమె వెంటనే తేరుకుని తన బాస్‌కు కాల్ చేసి విషయం మొత్తం చెప్పింది.
పిల్లి వల్లనే ఆ మెయిల్ వచ్చిందని చెప్పింది. తను ఉద్యోగంలో కొనసాగాలనుకుంటున్నట్టు పేర్కొంది. అయితే ఆమె బాస్ కనికరం చూపించలేదు. ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేశాడు. అంతేకాదు సంవత్సరాంతంలో రావాల్సిన బోనస్‌ను కూడా నిలిపివేశాడు. పెంపుడు పిల్లి చేసిన పని వల్ల ఆ మహిళ మరో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇదెక్కడి వింత.. ఈ పంపు నీటినే కాదు.. నిప్పును కూడా వదులుతోంది.. కారణమేంటి?
Viral Video: వామ్మో.. ఈ కుక్క చాలా డేంజర్.. తన ఢీకొన్న కారుపై ఎలా పగ తీర్చుకుంటోందో చూడండి..
Penguin Love Life: పెంగ్విన్‌లలో కూడా ప్రేమ, మోసం, విడాకులు.. వెలుగులోకి ఆశ్చర్యకర నిజాలు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి