Numerology: మీ పేరు S అక్షరంతో మొదలవుతుందా.. మీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 09:55 AM
న్యూమరాలజీ ప్రకారం.. మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ కధనంలో S అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరిదైనా వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే చాలు మార్గాలు ఉన్నాయి. లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోల ద్వారా కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అలా మాత్రమే కాకుండా న్యూమరాలజీ ప్రకారం.. మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ కధనంలో S, SH అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తెలుసుకుందాం..
విరుద్ధమైన లక్షణాలు..
న్యూమరాలజీ ప్రకారం.. 'S', SH అక్షరం పేరు ఉన్న వారు విరుద్ధమైన లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి కోపంగా ఎక్కువగా వస్తుంది. అలాగే ప్రేమను కూడా కలిగి ఉంటారు. వీరికి ఉదార స్వభావం ఉంటుంది. ఏదైనా క్లిష్ట పరిస్థితులలో ప్రియమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
భాగస్వామిని గౌరవిస్తారు..
S, SH తో మొదలయ్యే అక్షరాలు ఉన్న వ్యక్తులు తన భాగస్వామిని చాలా గౌరవిస్తాడు. ప్రేమ జీవితంలో S, SH తో మొదలయ్యే అక్షరాలు ఉన్న వ్యక్తులు రొమాంటిక్. ఈ వ్యక్తులు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు.
సృజనాత్మకంగా ఉంటారు..
S, SHతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా తెలివైనవారు, సృజనాత్మకంగా ఉంటారు. ఈ వ్యక్తులు గుంపులుగా నడవడానికి ఇష్టపడరు. ప్రతి పనిని తమదైన శైలిలో చేయడానికి ఇష్టపడతారు.
ఆత్మగౌరవం..
S, SH తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఎవరి నుండి సహాయం సులభంగా తీసుకోరు. కృషి, అంకితభావం ద్వారా విజయం సాధిస్తారు.
స్నేహపూర్వకంగా..
ఈ వ్యక్తులు ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా ఉంటారు.
చర్మ సంబంధిత వ్యాధులతో..
S, SH తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడతారు.
Also Read: హుస్సేన్‌సాగర్ ప్రమాదం ఘటన.. చికిత్స పొందుతూ ఒకరు మృతి