Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
ABN, Publish Date - Jan 25 , 2025 | 03:14 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రమాదాలతో ఆటలాడే ధోరణి విపరీతంగా పెరుగుతోంది. వ్యూస్, లైక్స్ కోసం చాలా మంది తమ ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టేస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ కోసం కొండచిలువతో సరసాలాడింది. చివరకు ఆమె పరిస్థితి ఏమైందో మీరే చూడండి..
ఈ ప్రపంచంలో పాములంటేనే (snakes) ఎక్కువ మంది భయడపతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, అలాంటిది కొండ చిలువను (Python) చూస్తేనే చాలా మందికి భయం మొదలవుతుంది. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రమాదాలతో ఆటలాడే ధోరణి విపరీతంగా పెరుగుతోంది. వ్యూస్, లైక్స్ కోసం చాలా మంది తమ ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టేస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ (Reels) కోసం కొండచిలువతో సరసాలాడింది. చివరకు ఆమె పరిస్థితి ఏమైందో మీరే చూడండి.. (Viral Video)
shhkodalera ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రష్యను యువతి ఫొటోలు, వీడియోల కోసం కొండచిలువను పట్టుకుని ఫోజులిచ్చింది. దానితో సరదాగా ఆటలాడుకుంది. అయితే కొద్ది సేపు నిశబ్దంగా ఉన్న ఆ కొండచిలువ ఆ తర్వాత తన నైజం చూపించింది. ఆ యువతి ముక్కును కొరికేసింది. దీంతో ఆ యువతి ఆ కొండచిలువను విసిరిపారేసి దూరంగా పారిపోయింది. అది విషపూరిత పాము కాకపోవడంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. అయినా ఆ యువతి ముక్కుపై కొండచిలువ కాటు పడింది. ఆ ఫొటోను కూడా ఆ యువతి పంచుకుంది (Python Attacks Model).
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అది విషపూరిత సర్పం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయి ఉండేవి``, ``మీ ఫొటో షూట్‌లో కోసం జంతువులతో ఆటలు వద్దు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Tiger Hunting video: మూడు పులి పిల్లలు, ఒక జింక.. ఆ వేట చివరకు ఎలా ముగిసిందో చూడండి..
Optical Illusion: ఈ ఫొటోలో మొదట మీకు ఏం కనబడింది.. దానిని బట్టి మీ క్యారెక్టర్‌ను అంచనా వేయవచ్చు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 25 , 2025 | 03:14 PM