Share News

Viral Lion Video: మృగరాజు అయితే మాకేంటి.. సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

ABN , Publish Date - Mar 03 , 2025 | 06:20 PM

వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ సింహానికి తేనెటీగలు చుక్కలు చూపించాయి.

Viral Lion Video: మృగరాజు అయితే మాకేంటి.. సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
Honey bees made their hive on the lion's body

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ సింహానికి (Lion) తేనెటీగలు (Honey bees) చుక్కలు చూపించాయి.


anil.beniwal29 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ సింహం తేనెటీగలతో ఇబ్బంది పడుతోంది. కొన్ని వేల తేనెటీగలు సింహం శరీరాన్ని చుట్టుముట్టేశాయి. సింహం శరీరంపై తేనెపట్టు పెట్టాయి. సింహం శరీరం అంతా తేనెటీగలతో నిండిపోయింది. సింహం నడస్తున్నా, పడుక్కున్నా ఆ తేనెటీగలు మాత్రం దాన్ని వదల్లేదు. వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతోంది. సింహం పరిస్థితిని చూసి, అడవిలో ఉన్న రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. తేనెటీగల బారి నుంచి సింహాన్ని కాపాడింది. దీంతో ఆ సింహానికి విముక్తి లభించినట్టైంది.


తేనెటీగలతో బాధపడుతున్న ఆ సింహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``తేనెటీగలు ఎంతటి వారినైనా వేధిస్తాయి``, ``వామ్మో.. చూడడానికి చాలా భయంకరంగా ఉంది``, ``మృగరాజుకు ఎంతటి కష్టం వచ్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూాడా చదవండి..

Mumbai Hotel: చెప్పుల దొంగతనం.. హోటల్ యాజమాన్యం ట్రిక్ తెలిస్తే మతి పోవాల్సిందే..

Optical Illusion: మీరు జీనియస్ అయితే.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2025 | 06:20 PM