Viral: నిత్య యవ్వనం కోసం కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్న మహిళ!
ABN, Publish Date - Jan 04 , 2025 | 09:37 AM
నిత్యం యవ్వనం కోసం కొడుకు రక్తాన్ని ఎక్కించుకునేందుకు సిద్ధమవుతున్న ఓ మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అనేక మంది ఆమెను విమర్శిస్తున్నారు. ఈ చర్యల నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జననం, వార్ధక్యం మరణం.. ఇవి ప్రకృతి సహజం. ఎవ్వరూ వీటికి అతీతులు కారు. కానీ మనుషుల మాత్రం వార్ధక్యాన్ని వీలైనంతగా వాయిదా వేసేందుకు తరతరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆధునిక శాస్త్రం వెన్నుదన్నుతో మరింత స్పీడుతో దూసుకుపోతున్నారు. అపరకుబేరులు మొదలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకూ అందరిదీ ఇదే దారి. అయితే, మాత్రం నైతికత హద్దు దాటుతూ తీసుకుంటున్న చర్యలు సంచలనంగా మారుతున్నాయి (Viral).
Viral: ప్రపంచంలో అతి భారీ ట్రాఫిక్ జామ్! 100 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!
అమెరికాకు చెందిన మార్సెలా ఇగ్లీసియాస్ (47) నిత్యం అందంగా కనబడాలని తెగ తపించిపోతుంటుంది. బార్బీ బొమ్మల్లా ఒంపుసొంపులతో కనబడేందుకు ఇప్పటికే అనేక రకాల సర్జరీలు చేయించుకుంది. ముంచుకొస్తున్న వార్ధక్యాన్ని అడ్డుకునేందుకు ఆమె రక్తమార్పిడిపై దృష్టి పెట్టింది. ఈ దిశగా ఏకంగా కొడుకు రక్తాన్ని ఎక్కించుకునేందుకు సిద్ధమైంది. దీంతో, స్థానికంగా ఇది పెను సంచలనానికి దారి తీసింది.
Viral: నీళ్లల్లోకి దిగిన సింహం! వెనక నుంచి దాడి చేసిన మొసలి! చివరకు..
తన శరీరంలోని కణాలను పునరుత్తేజితం చేసేందుకు ఆమె తన కొడుకు రోడ్రీగో రక్తాన్ని ఎక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు తన కుమారుడు కూడా అంగీకరించాడని చెబుతోంది. ‘‘మన శరీరంలోని కణాలకు కొత్త జవసత్వాలు ఇచ్చేందుకు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్‌కు మించినది లేదు. ఈ రక్తం కన్న కొడుకు లేదా కూతురి నుంచి వస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. రోడ్రీగోకు ఈ చికిత్స ఎలా చేస్తారో తెలుసు. ఈ చికిత్సతో ఒనగూడే ప్రయోజనాలపై కూడా అతడికి అవగాహన ఉంది. తన అమ్మమ్మకు కూడా రక్తాన్ని ఇచ్చేందుకు అతడు రెడీగా ఉన్నాడు’’ అని తెలిపింది.
Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్
యవ్వనంగా కనిపించేందుకు తాను మూలకణ చికిత్సలను ప్రయత్నిస్తున్న తరుణంలో రక్తమార్పిడి చికిత్స గురించి తెలిసిందని ఇగ్లిసియాస్ వెల్లడించింది. ముఖ్యం యువత నుంచి సేకరించే రక్తంతో మరిన్ని బెనిఫిట్స్ ఉన్నట్టు ఆమె తెలుసుకుంది. ‘‘రక్తమార్పిడి ద్వారా ఒంట్లోకి తాజా ఎర్రరక్త కణాలు చేరతాయి. ఇవి ఆక్సీజన్‌ను అన్ని భాగాలకు తరలిస్తాయి. ఇది దాహార్తితో అలమటిస్తున్న వ్యక్తి గొంతు తడిపిన నీరులాగా పనిచేస్తాయి’’ అని ఆమె చెప్పుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ చికిత్సకు ప్లాన్ చేస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.
Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్
Updated Date - Jan 04 , 2025 | 09:46 AM