Injured Monkey treated in Pharmacy: మనుషులను చూసి తెలివి నేర్చిన కోతి.. చేతికి గాయం కావడంతో...
ABN, Publish Date - Mar 14 , 2025 | 04:39 PM
చేతికి గాయమైన ఓ కోతి మెడికల్ షాపులోకి తనంతట తానుగా వచ్చి చికిత్స చేయించుకున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటనపై జనాలు నోరెళ్లబెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మనుషుల మధ్య తిరిగే కుక్కలు, పిల్లలు, ఇతర జంతువులు మన తీరుతెన్నులను అర్థం చేసుకోవడమే కాకుండా మనల్ని అనుకరించడం కూడా ప్రారంభించాయి. ఇందుకు తాజాగా ఉదాహరణగా నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కోతి తెలివి చూసి జనాలు షాకైపోతున్నారు. వీటి తెలివి ఇలా పెరిగితే ఇక కోతులకు అడ్డకట్ట వేసే వారే ఉండరంటూ సరదా కామెంట్ చేస్తున్నారు (Injured Monkey treated in Pharmacy).
బంగ్లాదేశ్‌లోని మెహ్రీపూర్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే, అక్కడ ఇటీవల ఓ కోతి చేతికి గాయమైంది. దీంతో, అది మరో ఆలోచన లేకుండా సమీపంలోని మెడికల్ షాపుకు వెళ్లింది. సడెన్‌గా కౌంటర్‌పై వచ్చి కూర్చున్న కోతిని చూసి షాపులోని సిబ్బంది ఆశ్చర్యపోయారు. గాయమైన చేతికి చికిత్స కోసం అది వచ్చిందని గుర్తించాక మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తరువాత ట్రీట్‌మెంట్ చేయడం ప్రారంభించారు.
కోతి చికిత్స కోసమే వచ్చిందనేందుకు సూచనగా అది అక్కడి సిబ్బందిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. వారు ఆయింట్‌మెంట్ రాస్తున్నంత సేపు మిన్నకుండా కూర్చుండిపోయింది. ఆ తరువాత కట్టుకడుతుంటే చేయి చాచింది. చుట్టూ ఉన్న వారు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. మెడికల్ షాపులో మందులు దొరుకుతాయన్న విషయాన్ని గుర్తించే తెలివి ఈ కోతికి ఎలా వచ్చిందని నోరెళ్లబెట్టారు.
Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!
మరోవైపు, నెట్టింట కూడా ఈ ఉదంతం వైరల్‌గా మారింది. బెంగాల్ టైగర్స్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు భారీగా వ్యూస్, లైకులు వచ్చి పడుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన జనాల కామెంట్స్‌కు అంతేలేకుండా పోయింది. కొందరు కోతి తెలివి చూసి మెచ్చుకున్నారు. మరికొందరు మాత్రం వీటిపై పన్ను వేయాలని డిమాండ్ చేశారు.
మరికొందరేమో.. కోతికి సాయపడ్డ వారిపై ప్రశంసలు కురిపించారు. బాధలో ఉన్న కోతి తో ప్రమాదం పొంచి ఉందని తెలిసీ సాయం చేసేందుకు సిద్ధపడి తమ గొప్ప మానసు చాటుకున్నారని డిమాండ్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది. మరి ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Updated Date - Mar 14 , 2025 | 04:40 PM