Viral: వామ్మో.. లక్ అంటే ఇదీ.. కేరళ నర్సుకు రూ.70 కోట్ల లాటరీ!
ABN, Publish Date - Jan 16 , 2025 | 08:26 PM
గల్ఫ్‌లో నర్సుగా పనిచేస్తున్న కేరళ వ్యక్తి రాత్రికి రాత్రి కటీశ్వరుడైపోయాడు. లాటరీలో ఏకంగా రూ.70 కోట్లు గెలుచుకున్నాడు. బాహ్రెయిన్‌లో ఉంటున్న అతడు తాను ఐదేళ్లుగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.

ఇంటర్నెట్ డెస్క్: రాత్రికి రాత్రి కోటీశ్వరుడైతే ఏం చేస్తావు అని ఎవరైనా అడిగితే కొట్టిపారేస్తాం. అలాంటివి సాధ్యం కాదు పొమ్మని చెబుతాం. కానీ, ఫారిన్‌లో ఉంటున్న ఓ కేరళ నర్సు జీవితం ఒక్క రోజులో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అతడికి బంపర్ లాటరీ తగలడంతో ఏకంగా రూ.70 కోట్లు అతడి సొంతమయ్యాయి. దీంతో, ప్రస్తుతం ఈ ఉదంతం అక్కడి భారతీయుల్లో చర్చనీయాంశమవుతోంది. నెట్టింట కూడా తెగ వైరల్ అవుతోంది (Viral).
కేరళకు చెందిన మనూ మోహనన్ ప్రస్తుతం బాహ్రెయిన్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 26న ఆయన స్థానికంగా అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ టికెట్ రాఫెల్ లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేశారు. బై టూ గెట్ వన్ ఫ్రీ స్కీమ్ కింద.. రెండు టిక్కెట్లు కొనుగోలు చేసి మరొకటి ఉచితంగా పొందారు. ఇక ఇటీవల ఈ లాటరీకి సంబంధించి లైవ్ టీవీ షోలో డ్రా నిర్వహించగా మనూ మోహనన్‌కు ఏకంగా 3 కోట్ల దిర్హామ్‌ల బంపర్ లాటరీ తగిలింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది ఏకంగా రూ.70 కోట్లకు సమానం.
Viral: రూ.30 లేక ఆసుపత్రి బయటే నిద్ర.. చలికి తట్టుకోలేక మృతి
ఇంత మొత్తం తనకు వచ్చిన విషయాన్ని మనూ మొదట అస్సలు నమ్మలేకపోయారు. ఇది నిజమేనా అంటూ ఏకంగా మూడు సార్లు షో హోస్ట్‌ను అడిగారు. తన టిక్కెట్ నెంబర్ కూడా తరిచి చూసుకున్నా నిజమని తేలి అతడు షాకైపోయారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, మనూ, అతడి స్నేహితులు గత ఐదేళ్లుగా లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏదోక రోజు కాలం కలిసిరాక మానదన్న ఆశతో క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొంటున్నారు. అయితే, తాజాగా మనూ కల నెరవేరింది. దీంతో, అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక అమ్మేసిన కుటుంబ సభ్యులు.. తట్టుకోలేక టీనేజర్ ఆత్మహత్య
కాగా, గత నెలలో దుబాయ్‌లోని మరో ఎన్నారై అరుణ్ అప్పుకుట్టన్ కూడా రాఫెల్ డ్రాలో రూ.59 కోట్లు గెలుచుకున్నాడు. ఈసారి డ్రా తీసేందుకు లాటరీ సంస్థ హోస్ట్‌తో పాటు పాల్గొన్నాడు. తన వద్ద మరో లాటరీ ఉందని, ఈ నెలలోనే దాన్నీ లాటరీ డ్రా నిర్వహిస్తారని తెలిపారు. లాటరీలో గెలిస్తే ఆ డబ్బును స్నేహితులతో కలిసి పంచుకుంటానని అన్నారు. తమలో చాలా మంది అప్పుల భారంతో సతమతమవుతున్నారని, ఈ డబ్బుతో కొందరు పెళ్లి కూడా చేసుకుంటారని చెప్పుకొచ్చారు. కాగా, దుబాయ్‌లో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న బిగ్ టికెట్ లాటరీ స్థానికుల్లో బాగా పాప్యులర్. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎందరో ఈ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు.
Updated Date - Jan 16 , 2025 | 09:31 PM