Share News

Viral: ఉద్యోగులకు చాకిరీ ఎక్కువగా ఉన్న దేశాలు.. ఇక్కడి వారు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారంటే..

ABN , Publish Date - Jan 11 , 2025 | 08:01 PM

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం, కొన్ని దేశాల్లోని ఉద్యోగలపై పని భారం తక్కువగా ఉంటే మరికొన్ని దేశాల్లోని వారిపై ఇది ఎక్కువగా ఉంది. మరి పనిగంటలు అత్యధికంగా ఉన్న దేశాలు ఏవో ఈ కథనంలో చూద్దాం.

Viral: ఉద్యోగులకు చాకిరీ ఎక్కువగా ఉన్న దేశాలు.. ఇక్కడి వారు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎస్ సుబ్రమణియన్ సూచించడం ఎంత సంచలనానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు సీఈఓలు ఇదే చెబుతుంటే మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత అవసరమని అంటున్నారు (Viral).

ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉందనేదానిపై నెట్టింట చర్చ మొదలైంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఉద్యోగులకు చాకిరీ ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ 13వ స్థానంలో ఉంది. మన దేశంలో ఉద్యోగులు సగటున వారానికి 46.7 గంటలు పనిచేస్తారట. ఉద్యోగుల్లో దాదాపు సగం మంది వారానికి 49 గంటలకంటే ఎక్కువే విధుల్లో గడుపుతారట.

Viral: తన తండ్రికి ఉద్యోగం కోరుతూ యువతి అభ్యర్థన .. నెట్టింట ప్రశంసల వెల్లువ


ఐఎల్ఓ ప్రకారం.. ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటంటే..

  • జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ భూటాన్ ప్రపంచంలో అత్యధిక పనిగంటలు ఉన్న దేశంగా నిలిచింది. ఇక్కడి జనాలు వారానికి 54.4 గంటలు విధుల్లోనే ఉంటారు.

  • యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వారానికి సగటు పనిగంటలు 50.9

  • లెసోతో దేశంలోని ప్రజలు వారానికి 50.4 గంటలు ఉద్యోగబాధ్యతలతో గడుపుతారు.

  • ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన కాంగోలో ఉద్యోగులు సగటున వారానికి 48.6 గంటల పాటు విధుల్లో ఉంటారు.

  • ఆ తరువాతి స్థానంలో ఉన్న ఖతర్‌లో ఉద్యోగుల సగటు పని గంటలు 48.

Viral: యువతలో కొత్త ట్రెండ్.. జాబ్‌లో చేరిన తొలి రోజే కంపెనీలకు షాకిస్తూ రాజీనామాలు!


  • ఆరో స్థానంలో ఉన్న లైబీరియాలో ఉద్యోగులు సగటున వారానికి 47.7 గంటలు పనిచేస్తారు.

  • లెబనాన్‌లో జనాలు వారానికి 47.6 గంటల పాటు ఉద్యోగంలో బిజీబిజీగా గడిపేస్తారు.

  • మంగోలియా ఉద్యోగులు సగటున వారానికి 47.3 గంటల మేర వెచ్చిస్తారు. ఇక జార్డాన్ దేశ వాసులు వారానికి 47 గంటలు ఉద్యోగంపై వెచ్చిస్తారు.

అయితే, ఉద్యోగులకు పనిభారం అతి తక్కువగా ఉన్న దేశాల్లో వనవాటూ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు వారానికి సగటున కేవలం 24.7 గంటలు మాత్రమే పనిచేస్తారట. ఇక కిరిబాటీ, మైక్రోనేషియాలోని వారు కూడా వారానికి 30 గంటల లోపే ఉద్యోగానికి కేటాయిస్తారు.

Read Latest and Viral News

Updated Date - Jan 11 , 2025 | 08:06 PM