ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఇదేందయ్యా.. ఇదీ.. ఎక్కడా వినలేదే.. ఈ వ్యక్తికి ఎందుకు ఫైన్ వేశారో తెలిస్తే షాకవ్వడం ఖాయం..

ABN, Publish Date - Jan 11 , 2025 | 02:16 PM

ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. అందులో ఎలాంటి తప్పూ లేదు. అయితే ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు చేసే పనులు విమర్శల పాలవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ట్రాఫిక్ పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో విమర్శలపాలవుతోంది.

Man fined for walking without helmet

వాహనాల మీద వెళ్లే వాళ్లు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) పాటించాల్సిందే. బైక్‌ల మీద వెళ్లే వాళ్లు హెల్మెట్ (Helmet) పెట్టుకోవడం తప్పనిసరి. ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానా (Fine) విధిస్తున్నారు. అందులో ఎలాంటి తప్పూ లేదు. అయితే ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు చేసే పనులు విమర్శల పాలవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) లోని ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) చేసిన పని సోషల్ మీడియాలో విమర్శలపాలవుతోంది (Viral News).


మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కూతురు పుట్టినరోజు సందర్భంగా కేక్ కొనేందుకు నడుచుకుంటూ వెళ్లాడు. ఆ సమయంలో అతడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అతడిని అడ్డగించి తమతో పాటు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నడుస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు అనే కారణం చూపి అతడికి రూ.300 జరిమానా విధించారు. అతడిని స్టేషన్ ముందు నిల్చోబెట్టి ఫొటో కూడా తీశారు. దీంతో అతడు ఖంగు తిన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిమానా విధించడం ఏంటని షాకయ్యాడు. అతడు వెంటనే ఎస్పీ కార్యాలయానికి చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు.


నడుచుకుంటూ వెళ్తున్న తనకు హెల్మెట్ లేదని రూ.300 జరిమానా విధించారని, స్టేషన్‌కు తీసుకెళ్లి తనను బెదిరించారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ విషయం తీవ్రమైంది. నడుచుకుంటూ వెళ్తున్న వారికి హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో జరిమానా వేయడం జరగదని, అసలు విషయంలో ఏంటో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరుపుతామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇది మామూలు ఫైట్ కాదు.. పాము-ముంగిస పోరాటం చూశారా? చివరకు ఏం జరిగిందంటే..


Brain Teaser Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ టీచర్లు ఇద్దరిలో ఎవరు పేదవారో 5 సెకెన్లలో గుర్తించండి..


Electricity Bill: కరెంట్ బిల్లు చూసి షాక్.. ఏకంగా రూ.200 కోట్లు రావడంతో యజమాని పరిస్థితి ఏంటంటే..


Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 11 , 2025 | 02:16 PM