Viral Video: నా పాపాలే కాదు.. నా మొబైల్ పాపాలు కూడా పోవాలి.. కుంభమేళాలో ఓ కుర్రాడు ఏం చేశాడంటే..

ABN, Publish Date - Feb 18 , 2025 | 02:37 PM

144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా కావడంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు.

Viral Video: నా పాపాలే కాదు.. నా మొబైల్ పాపాలు కూడా పోవాలి.. కుంభమేళాలో ఓ కుర్రాడు ఏం చేశాడంటే..
Holy bath to mobile

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహా కుంభమేళా (MahaKumbh) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో వైభవంగా జరుగుతోంది. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా కావడంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళాలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అప్పటివరకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని కొందరు నమ్ముతారు (Viral Video).


పాపాలన్నీ తొలగిపోతాయనే నమ్మకంతో కొందరు విచిత్రమైన పనులు చేస్తున్నారు. కొందరు చనిపోయిన తమ తల్లిదండ్రుల ఫొటోలను కూడా తీసుకొచ్చి త్రివేణి సంగమ నీటిలో ముంచుతున్నారు. మరికొందరు తమ పెంపుడు జంతువుల చేత కూడా పుణ్య స్నానం చేయిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మరింత విచిత్రమైన పని చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి పేరు కౌశల్ సాహు. ముందుగా కౌశల్ నీళ్లలో మూడు సార్లు మునిగాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్‌ (Mobile)‌ను బయటకు తీశాడు. తన మొబైల్ కూడా చాలా పాపాలు చేసిందని, దానికి కూడా శుద్ధి అవసరమని చెప్పి.. ఖరీదైన ఆ ఫోన్‌ను కూడా నీళ్లలో మూడు సార్లు ముంచి లేపాడు (Holy bath to mobile).


దీంతో చుట్టు పక్కల వారు అతడిని విచిత్రంగా చూశారు. మొబైల్‌ ఫోన్‌కు కూడా పవిత్ర స్నానం చేస్తున్న ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ``మొబైల్ కూడా అనేక పాపాలకు బాధ్యత వహిస్తుంది`` అంటూ అతడు షేర్ చేసిన ఆ వీడియోను వేల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ స్నానంతో ఆ మొబైల్‌కు మోక్షం లభిస్తుంది``, ``అతడు క్రోమ్ బ్రౌజర్ పాపాలను కడిగేశాడు`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..


Optical Illusion: మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 18 , 2025 | 02:37 PM