Viral: ఎమ్‌బీయే చేశాక జొమాటోలో జాబ్ ఆఫర్ వస్తే సంతోషపడ్డాడు! శాలరీ ఎంతో తెలిశాక..
ABN , Publish Date - Jan 10 , 2025 | 08:01 PM
జొమాటోలో తనకొచ్చే శాలరీ ఖర్చులకే సరిపోతోందంటూ ఓ యువ ఎంబీయే గ్రాడ్యుయేట్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. తన శాలరీ పెంపు ప్రతిపాదనలను కంపెనీ నిర్ద్వంద్వంగా తొలగించిన తీరు మనసును గాయపరిచిందని సదరు వ్యక్తి వాపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: నగరాల్లో చాలీచాలని జీతాలు, పెరుగుతున్న జీవన వ్యయాలతో యువ ఉద్యోగులు పడుతున్న అవస్థలను హైలైట్ చేసే మరో ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. జోమాటోలో శాలరీతో కంగుతిన్న ఓ యువ ఎంబీయే గ్రాడ్యుయేట్ ఈ మేరకు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వచ్చే శాలరీ ఖర్చులకే సరిపోని స్థితిలో, లైఫ్‌లో ఎలా ఎదగాలి, ఎలా ముందడుగు వేయాలి అంటూ సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుభవాన్ని జనాలతో పంచుకున్నారు (Viral).
జొమాటోలో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ నిరాశపరిచేదిగా ఉందని సదరు వ్యక్తం అన్నారు. శాలరీ పెంపుపై తన ప్రతిపాదనలను హెచ్ఆర్ అధికారులు నిర్ద్వంద్వంగా తోసి పుచ్చిన తీరు మనసును గాయపరిచిందని చెప్పారు.
Viral: కలలో కనిపించిన సంఖ్య ప్రకారం లాటరీ టిక్కెట్టు కొన్న మహిళ.. చివరకు ఊహించని విధంగా..
‘‘జొమాటోలో అసోసియేట్ రూల్ ఉద్యోగానికి నాకు ఆఫర్ వచ్చింది. కొత్త జాబ్ నాకు ఉత్సాహం ఇచ్చినా ఎంపిక ప్రక్రియ మాత్రం నన్ను నిరాశ పరిచింది. వాళ్లు ఇచ్చే శాలరీ నా కనీస అవసరాలకే సరిపోతుంది. శాలరీ పెంపుపై వారితో చర్చించేందుకు ప్రయత్నిస్తే వారు నా ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇచ్చింది తీసుకో లేకపోతే వెళ్లిపో అన్నట్టు వారి తీరు ఉంది. నేను మరో నగరం నుంచి గురుగ్రామ్‌కు వస్తు్న్నానని తెలిసీ వారు ఇలా చేయడం సబబుగా అనిపించలేదు’’ అని సదరు యువకుడు వాపోయాడు. ఖర్చులు పోను నెలకు కనీసం 1000 కూడా మిగిలే పరిస్తితి లేదన్నాడు.
Viral: ఇన్ఫీ నారాయణ మూర్తిని మించిపోయిన ఎల్ అండ్ టీ చైర్మన్! వారానికి 90 గంటలు పనిచేయాలంటూ పిలుపు
మరో నగరం నుంచి మకాం మారుస్తున్నందున తనకు కంపెనీ రీలోకేషన్ సపోర్టు ఇస్తుందనుకుంటే నిరాశే ఎదురైందని వాపోయారు. పీజీ అకామడేషన్‌కు కావాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వడం కుదరదని వారు తెగేసి చెప్పారి వాపోయారు. అసలు తన ప్రతిపాదనలను పెడ చెవినపెట్టారని అన్నారు.
ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడి పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. సీఈఓలకు 50 లక్షలు ఇస్తున్న సంస్థలు సాధారణ ఉద్యోగుల విషయంలో మాత్రం కఠినంగా ఉంటున్నాయని కొందరు వాపోయారు. తన పరిస్థితిని నెట్టింట ధైర్యంగా పంచుకున్న అతడపై కొందరు ప్రశంసలు కురిపించారు. మరికొందరు మాత్రం ఇలాంటి విషయాలు బయట పెట్టడం సబబుగా అనిపించడం లేదని కొందరు పెదవి విరిచారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.