Gold Rings Theft: బాబోయ్.. వీరి అతి తెలివి చూడండి.. బంగారం కొట్టేయడానికి ఏం చేశారంటే..

ABN, Publish Date - Mar 14 , 2025 | 04:19 PM

బిహార్ అంటేనే ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలకు అడ్డాగా ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు మహిళలు చేసిన దొంగతనం నెట్టింట తెగ వైరల్‍గా మారింది.

Gold Rings Theft: బాబోయ్.. వీరి అతి తెలివి చూడండి.. బంగారం కొట్టేయడానికి ఏం చేశారంటే..
Gold Rings Theft

బిహార్: కొంతమంది మహిళలు దొంగతనాలు చేస్తూ అప్పుడప్పుడు పట్టుపడుతుండడం తెలిసిందే. బట్టల షాపులు, నగల దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు వంటి వాటికి వెళ్లి చోరీలు చేస్తుంటారు. బస్టాప్‍లు, సినిమా థియేటర్లు, ఇళ్లనూ వదిలిపెట్టకుండా అందిన కాడికి దోచేస్తుంటారు. అలాగే మరికొంతమంది మహిళలు అయితే ఏకంగా పిల్లలను సైతం కిడ్నాప్ చేస్తుంటారు. ఇలాంటి వారిని పోలీసులు కటకటాల వెనక్కి పంపిన సందర్భాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే తాజాగా బిహార్‍లో జరిగిన ఓ చోరీ వైరల్‍గా మారింది.


బిహార్ అంటేనే ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలకు అడ్డాగా ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు మహిళలు చేసిన దొంగతనం నెట్టింట తెగ వైరల్‍గా మారింది. నలంద సిలే మార్కెట్ ప్రాంతంలో ఓ గోల్డ్ షాపునకు వెళ్లిన ఇద్దరు మహిళలు.. దుకాణం యజమానితో నగలు కొనేందుకు వచ్చామని చెబుతారు. శుభకార్యం ఉందని, మంచి డిజైన్ కలిగిన ఆభరణాలు చూపించాలని అడుగుతారు. దీంతో సదరు వ్యక్తి వారి ముందు పలు రకాల ఆభరణాలు ఉంచుతాడు. కాసేపు ఆగిన తర్వాత అవి నచ్చలేదని, ప్రస్తుతానికి ఉంగరాలు చూపించాలని అడుగుతారు. ఈ మేరకు అతను పలు డిజైన్లు కలిగిన పదుల సంఖ్యలో ఉన్న ఉంగరాలను వారి ముందు పెడతాడు.


షాపు యజమాని వారి ముందే కూర్చోవడంతో ఉంగరాలను పరిశీలిస్తున్నట్లు కాసేపు నటిస్తారు సదరు కిలేడీలు. అనంతరం యజమాని ఇతర కస్టమర్లను చూసుకునేందుకు వెళ్తున్న సమయంలో ఒక్కొక్కటిగా ఉంగరాలను ఓ మహిళ మింగేస్తుంది. కిలేడీలతోపాటు షాపులో చాలా మంది కస్టమర్లు ఉండడంతో వీరి చేసిన పనిని ఓనర్ గమనించలేకపోతాడు. కాసేపటి తర్వాత రింగ్స్ నచ్చలేదంటూ ఇద్దరూ లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారు. అయితే ఉంగరాలు తక్కువగా ఉండడాన్ని గమినించిన సదరు షాపు యజమాని వారిని నిలువరిస్తాడు. ఉంగరాలు తక్కువగా ఉన్నాయంటూ వారిని ప్రశ్నించగా.. తమకేమీ తేలియదంటూ బుకాయిస్తారు. వెంటనే సీసీ కెమెరాలు తనిఖీ చేస్తాడు షాపు యజమాని. దీంతో ఇద్దరిలో ఒకరు ఉంగరాలు మింగడం స్పష్టంగా కనిపిస్తుంది.


దుకాణదారుడు వెంటనే సిలే పోలీస్ స్టేషన్ ఎస్‍హెచ్‍వో మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్‍కు సమాచారం అందిస్తారు. హుటాహుటిన దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు ఇద్దరి మహిళలనూ అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మహిళలు దొంగతనానికి పాల్పడుతూ ఉంగరాలు మింగేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు వివిధ రకాలు కామెంట్లు చేస్తున్నారు. కాగా, బిహార్‌లోని అర్రాలోని తనిష్క్ షోరూమ్‌‍లో సోమవారం తుపాకులతో వచ్చిన దొంగలు భారీ చోరికి పాల్పడ్డారు. సిబ్బందిని బెదిరించి రూ.25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Warangal: పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..

Metro Viral Video: బస్టాండ్ చేశావ్ కదరా.. మెట్రోలో ఇతడి నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Mar 14 , 2025 | 04:46 PM