Viral: వామ్మో.. వాడకం అంటే ఇదే.. విద్యుత్ కారు బ్యాటరీని ఎలా వాడేస్తున్నాడో చూస్తే..
ABN, Publish Date - Jan 14 , 2025 | 08:55 PM
వీ2ఎల్ ఎడాప్టర్ సాయంతో విద్యుత్ కారు బ్యాటరీ వినియోగించి ఇండక్షన్ స్టవ్‌పై వంట చేసుకున్న ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడి తెలివికి జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రోజూవారి ఎదురయ్యే సమస్యలకు చిట్కా పరిష్కారాలను కనుగొనడంలో భారతీయులు సిద్ధహస్తులు. ఇలాంటి చిట్కాలను ఉత్తరాదిన జుగాడ్ అని పిలుస్తుంటారు. ఇందుకు సంబంధించి వీడియోలు నెట్టింట కోకొల్లలుగా వైరల్ అవుతుంటాయి. కొన్ని మాత్రం ఊహించని స్థాయిలో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ వీడియో గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వీడియోలోని వ్యక్తి కారు బ్యాటరీని ఉపయోగించి రోడ్డు పక్కన వంట చేసుకున్న తీరు జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది (Viral).
వీడియోలో కనిపించిన వ్యక్తి రోడ్డు పక్కన ఇండక్షన్ స్టవ్‌పై తనకు అమితంగా ఇష్టమైన కచోరీలను వండుకున్నాడు. అయితే, ఇండక్షన్ స్టవ్‌కు అవసరమైన విద్యుత్‌ను అతడు తన ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ నుంచి తీసుకున్నాడు. కారు బ్యాటరీ వైర్లను స్టవ్‌కు జత చేసి చక్కగా నూనె బాండీలో కచోరీలను వేయించుకున్నాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఇదంతా వీడియో తీసి నెట్టింట పంచుకోవడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.
Viral: ఆటో డ్రైవర్‌ను పబ్లిక్‌గా చెంపలు వాయించిన యువతి.. షాకింగ్ వీడియో
అయితే, కారు బ్యాటరీ నుంచి విద్యు్త్ తీగలను ఎలా కనెక్ట్ చేశాడని వీడియో చూసిన అనేక మందికి కలిగిన ప్రధాన సందేహం. దీనిపై నెటిజన్లలోనే కొందరు సవివరమైన పోస్టు పెట్టారు. వెహికిల్ టూ లోడ్ చార్జింగ్ సాయంతో అతడు ఇండక్షన్ స్టవ్ కోసం విద్యుత్‌ను తీసుకున్నాడని చెప్పారు. ఇక ఈ ఐడియాపై కొందరు సెటైర్లు కూడా పేల్చారు. ఇలా అన్నింటికీ కార్లలోని విద్యుత్ వాడేస్తే అనుకోని సందర్భాల్లో వాహనం నిలిచిపోయి చుక్కలు కనిపిస్తాయని అన్నారు.
Viral: భారత్‌లో పరిస్థితులు ఇంకా మారలేదని ఇప్పుడే అర్థమైంది.. ఎన్నారై విచారం
ఏమిటీ వీటూ ఎల్ చార్జింగ్..
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఇదో స్పెషల్ ఎడాప్టర్. దీని సాయంతో విద్యుత్ కారు బ్యాటరీలోని డీసీ కరెంట్‌ను ఏసీగా మార్చి వివిధ ఉపకారణాలకు విద్యుత్‌ను సరఫరా చేయొచ్చట. వీటూ ఎల్ చార్జింగ్‌కు అనువైన వాహనాలు పవర్ బ్యాంకులుగా వాడుకోవచ్చని చెబుతున్నారు. విద్యుత్ అవసరమైన సందర్భాల్లో వీ టూ ఎల్ సాయంతో ఫోన్ చార్జింగ్ మొదలు అనేక యంత్రాలకు విద్యుత్ సరఫరా చేయొచ్చని అంటున్నారు. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ ఊపందుకుందని, విద్యుత్ వాహనాల స్వరూప స్వభావాలు మార్చే దిశగా పరిణామాలు సాగుతున్నాయని చెబుతున్నారు.
Viral: చేతులారా పెళ్లి చెడగొట్టుకున్న వరుడు.. ఏం జరిగిందో తెలిస్తే..
Updated Date - Jan 14 , 2025 | 11:43 PM