Viral Video: ఈ వ్యక్తి బ్రెయిన్‌కు సలాం.. మేఘాల గర్జనను ఎలా వినిపించాడో చూడండి..
ABN, Publish Date - Jan 02 , 2025 | 09:18 PM
చాలా మంది ఇంటికి రావడం ఆలస్యమైతే రకరకాల కారణాలు చెబుతుంటారు. కొందరు సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. అందుకోసం ఒక్కోసారి అబద్ధపు శబ్దాలను వినిపిస్తారు. అందులో ఎంతో క్రియేటివిటీ కూడా ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనం చాలా సార్లు ఫోన్‌లు మాట్లాడేపుడు చాలా అబద్ధాలు చెబుతాం. ముఖ్యంగా చాలా మంది తమ భార్యలకు అబద్ధాలు చెబుతుంటారు. ఇంటికి రావడం ఆలస్యమైతే రకరకాల కారణాలు చెబుతుంటారు. కొందరు సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. అందుకోసం ఒక్కోసారి అబద్ధపు శబ్దాలను (Fake Sounds) వినిపిస్తారు. అందులో ఎంతో క్రియేటివిటీ (Creativity) కూడా ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వ్యక్తి మేఘాల గర్జనను (Thunderstorm) అత్యంత సహజంగా సృష్టించాడు. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది (Viral Video).
@Enezator అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఓ గదిలో ఉండి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అవతలి వ్యక్తికి తాను వర్షంలో చిక్కుకుపోయినట్టు చెబుతున్నాడు. అందుకు సాక్ష్యంగా మేఘాల గర్జనను కూడా వినిపిస్తున్నాడు. అతను ఒక బేనర్‌ను పట్టుకుని గట్టిగా కదిలిస్తున్నాడు. లోహంతో తయారైన ఆ బ్యానర్ వేగంగా కదులుతున్నప్పుడు అచ్చం మేఘాల గర్జనలాంటి సౌండ్ వస్తోంది. ఆ వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి అచ్చం మేఘాల గర్జనను సృష్టించాడు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 17 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఏం ఐడియా గురూ``, ``వావ్.. అద్భుతమైన క్రియేటివిటీ``, ``ఒక సమస్యకు ఇది క్రియేటివ్ సొల్యూషన్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఎంతటి గజదొంగ అయినా షాకవ్వాల్సిందే.. ఈ ఇంటికి తాళం ఎలా వేశారో చూడండి..
Viral Video: హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా తగ్గేదే లే.. ఈ బామ్మ తీరు చూస్తే నవ్వాపుకోలేం..
Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..
Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..
Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 02 , 2025 | 09:18 PM