Viral Video: స్వర్గంలో ప్రయాణం.. 4 వేల కి.మీ. జర్నీ.. రూ. 1.5 లక్షల టిక్కెట్.. ఎక్కడో తెలుసా?
ABN , Publish Date - Jan 12 , 2025 | 07:51 AM
రైలు ఎక్కి కూర్చోగానే ఇంట్లోనే ఉన్నంత సౌకర్యవంతంగా ఉంటుంది. రవాణా ఖర్చు కూడా మిగతా వాటితో పోల్చితే తక్కువగానే ఉంటుంది. అందుకే మన దేశంలో రైలు ప్రయాణం చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్ రైలు ప్రయాణానికి సంబంధించిన అద్భుతమైన అనుభూతిని పంచుకున్నాడు.
బైక్, కారు, బస్సు, విమానంలో ఎంత ప్రయాణించినా, రైలు ప్రయాణంలోని (Train Journey) మజా మరే ఇతర రవాణాలోనూ కనిపించదు. రైలు ఎక్కి కూర్చోగానే ఇంట్లోనే ఉన్నంత సౌకర్యవంతంగా ఉంటుంది. రవాణా ఖర్చు కూడా మిగతా వాటితో పోల్చితే తక్కువగానే ఉంటుంది. అందుకే మన దేశంలో రైలు ప్రయాణం చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్ రైలు ప్రయాణానికి సంబంధించిన అద్భుతమైన అనుభూతిని పంచుకున్నాడు. కెనడా (Canada)లోని ఆ ప్రత్యేకమైన రైలు జర్నీ చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపించడం ఖాయం (Viral Video).
navankurchaudhary అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో ఆ వ్యక్తి కెనడాలోని వాంకోవర్ నుంచి టొరంటోకు రైలు జర్నీ చేస్తున్నాడు. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత సుదీర్ఘమైన రైలు జర్నీ. ఈ రెండు నగరాల మధ్య దూరం 4 వేల కిలోమీటర్లు. దాదాపు ఐదు రోజుల ప్రయాణం. వాంకోవర్ నుంచి టొరంటోకు ఫస్ట్ క్లాస్ భోగీలో ప్రయాణించాలంటే దాదాపు లక్షా యాభై వేల రూపాయలు చెల్లించాల్సిందే. అంత ధర వెచ్చించి శీతాకాలంలో ప్రయాణం చేస్తే మాత్రం స్వర్గ లోక విహారం చేసిన అనుభూతి కలగడం ఖాయం.
ఆ రైలులో ఫస్ట్ క్లాస్ భోగీ విలాసవంతమైన హోటల్‌ను తలపించడం ఖాయం. దానిలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఇక, కిటికీ నుంచి బయట కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత అందంగా ఉన్నాయి. చెట్లపై మంచు కురుస్తుండడంతో చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఆ జర్నీని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడతంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించారు. లక్ష కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ ఖర్చుతో నేను మొత్తం భారతదేశాన్ని చుట్టేస్తాను``, ``అద్భుతమైన జర్నీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: వర్షం పడుతోంది.. ఈ పిల్లల గొడుగు ఎక్కడుందో 5 సెకెన్లలో గుర్తించి చెప్పండి..
Viral Video: ఇది మామూలు ఫైట్ కాదు.. పాము-ముంగిస పోరాటం చూశారా? చివరకు ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి