Viral: విమానం గాల్లో ఉండగా కిటికీ అద్దం విరగగొట్టిన ప్యాసింజర్! ఎందుకో తెలిస్తే..
ABN, Publish Date - Feb 08 , 2025 | 10:05 PM
సీట్లు మార్చుకుందామన్న తోటి ప్రయాణికురాలిపై మండిపడ్డ ఓ వ్యక్తి కోపంలో విమానం కిటికీ అద్దం పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అమెరికాకు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: తన సీటు మారమని తోటి ప్రయాణికురాలు కోరినందుకు చిరాకు పడ్డ ఓ ప్రయాణికుడు చివరకు విమానం అద్దం పగలగొట్టే ప్రయత్నం చేశాడు. విమానం గాల్లో ఉండగా కిటికీ అద్దంపై ముష్టిఘాతాలు కురిపించడంతో అద్దం పైపొర పగిలిపోయింది. అమెరికాకు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో గత మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది (Viral).
Viral: భార్యపై ఇలాంటి రివెంజ్ తీర్చుకోవడం మీరెక్కడా చూసుండరు!
స్థానిక మీడియా కథనాల ప్రకారం, డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌లోని జార్జ్ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు విమానం బయలుదేరిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ప్రయాణికుడు నానా యాగీ సృష్టించాడు. ముందు సీటులోని ప్రయాణికురాలు అతడితో సీట్లు మార్చుకుందామని కోరిందట. ఇంత చిన్న విషయానికే తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు రెచ్చిపోయాడు. ఉద్రేకంలో విమానం కిటికీపై ముష్టిఘాతం కురిపించాడు. దీంతో, అద్దం పైపొర చిట్లిపోయింది. దీంతో, తోటి ప్రయాణికులు సిబ్బందితో కలిసి అతడిని అదుపులో ఉంచాల్సి వచ్చింది. ఓ వ్యక్తి అతడి చేయిని వెనక్కు మెలిపెట్టి పట్టుకుంటే కానీ అతడు అదుపులోకి రాలేదు.
CIBIL Score: సిబిల్ స్కోరు తక్కువగా ఉన్న వరుడికి షాక్! చివరి నిమిషంలో పెళ్లి రద్దు!
ఇక విమాన నిబంధనల ప్రకారం, విమానంలో ప్రయాణికుల ఉల్లంఘనలు సివిల్ లేదా క్రిమినల్ నేరాల కింద వర్గీకరిస్తారు. సిబ్బంది సూచనలను లక్ష్య పెట్టనప్పుడు జరిమానాలు విధించడం లేదా విమానం నుంచి తొలగించడం చేస్తారు. ఇక సాటి ప్రయాణికులపై లేదా సిబ్బందిపై దాడికి దిగితే జైలు పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి నిందితులు మళ్లీ విమాన ప్రయాణం చేపట్టకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందట. ఇక విమానాల్లోకి నిషేధిత వస్తువులు లేదా ఆయుధాలు తీసుకెళితే అమెరికా నిబంధనల ప్రకారం 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
Updated Date - Feb 08 , 2025 | 10:05 PM