IVF: బిడ్డ పుట్టాక బయట పడ్డ ఐవీఎఫ్ కేంద్రం పొరపాటు.. తల్లి షాక్
ABN , Publish Date - Feb 21 , 2025 | 10:02 AM
ఐవీఎఫ్ కేంద్రం పొరపాటు కారణంగా ఓ శ్వేతజాతి మహిళ నల్లజాతి శిశువుకు జన్మనిచ్చింది. దీంతో, బాధితురాలు సదరు కేంద్రంపై న్యాయపోరాటం ప్రారంభించింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఐవీఎఫ్ కేంద్రం చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళకు భారీ షాక్ తగిలింది. తనకు నల్లజాతికి చెందిన బిడ్డ పుట్టడంతో నిర్ఘాతపోయిన శ్వేతజాతి మహిళ చివరకు కోర్టును ఆశ్రయించింది. జార్జియాలో ఈ ఘటన వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, క్రిస్టీనా ముర్రే (38) అనే మహిళ కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో తల్లి కావాలనుకుంది. 2022లో ఆమె కోస్టల్ ఫర్టిలిటీ సెంటర్‌ను ఎంచుకుంది. తన నివాసానికి దగ్గర్లోనే సంస్థకు చెందిన బ్రాంచ్ ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ తరువాత ట్రీట్‌మెంట్ సందర్భంగా ఎన్నో శారీరక ఇబ్బందులను ఎదుర్కొన్న మహిళ బిడ్డ కోసం ఆ మాత్రం తప్పదని సర్దుకుపోయింది. ఆ చిన్నారి కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసింది. చివరకు ఆమె ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 2023 డిసెంబర్‌లో ఆమె బిడ్డకు జన్మనించింది (Viral).
City Killer Asteroid: భారీ గ్రహశకలంతో ముంబై, కోల్‌కతాకు ముప్పు ఉందా? నాసా ఏం చెప్పిందంటే..
కానీ బిడ్డ పుట్టిందన్న ఆనందం ఆమెకు క్షణకాలంలోనే ఆవిరైపోయింది. ముర్రే శ్వేత జాతి మహిళ. ఈ క్రమంలో ఆమె స్పెర్మ్ డోనర్‌గా శ్వేత జాతికి చెందిన వ్యక్తిని ఎంచుకుంది. కానీ డెలివరీ తరువాత నల్లజాతి వారి లక్షణాలున్న బిడ్డ పుట్టడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. కానీ మాతృత్వం కోసం ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న ఆమె బిడ్డను వదులుకోలేకపోయింది. విషయం ఎవరికీ తెలీకుండా జాగ్రత్త పడింది. బిడ్డే లోకంగా జీవించడం ప్రారంభించింది. అయితే, మనసులో రకరకాల సందేహాల కారణంగా ఆమె ఆ మరుసటి నెలలో తన బిడ్డకు హోమ్ డీఎన్ఏ టెస్టు చేయగా తన అనుమానాలు నిజమని తేలింది. ఆ బిడ్డ తనది కాదన్న విషయం స్పష్టమైపోయింది.
Viral: విడాకుల తీసుకున్న వెంటనే తోడు కోసం మహిళ ప్రయత్నం! జీవితం తలకిందులు
దీంతో, ఈ విషయాన్ని ఐవీఎఫ్ కేంద్రానికి సమాచారం ఇచ్చింది. విచారణ జరిపిన ఐవీఎఫ్ కేంద్రం తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించింది. మరో జంటకు చెందిన అండాన్ని బాధితురాలి శరీరంలోకి ప్రవేశపెట్టినట్టు గుర్తించింది. ఈ విషయం ఆ జంటకు కూడా తెలియడంతో వారు కూడా షాకైపోయారు. తమ బిడ్డ తమకు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. బిడ్డను దక్కించుకునేందుకు ముర్రే పోరాడినా ఉపయోగం లేకపోయింది. కోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా రావడంతో బిడ్డను అసలు తల్లిదండ్రులకు అప్పగించాల్సి వచ్చింది. తన జీవితంలో పూడ్చలేని అగాధం మిగలగడంతో బాధితురాలు ఐవీఎఫ్ కేంద్రంపై కేసు దాఖలు చేసింది.
అయితే, ఐవీఎఫ్ పద్ధతిలో మరో సారి గర్భధారణకు ఆమె సిద్ధమైంది. తల్లి కావడం తన లక్ష్యమని, మరోసారి ప్రయత్నిస్తానని పేర్కొంది. అయితే, తనలా మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ న్యాయ పోరాటం ప్రారంభించినట్టు పేర్కొంది.