Viral Video: అక్కడ రెండు జంతువులు ఉన్నాయి.. ఏనుగుతో యువకుడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం..
ABN, Publish Date - Jan 15 , 2025 | 08:33 AM
అడవుల మధ్య నుంచి రోడ్లు వేస్తుండడంతో వన్య ప్రాణులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ జోలికి వస్తే తప్ప ఆగ్రహం ప్రదర్శించని ఏనుగులతో ఓ కుర్రాడు పిచ్చిగా ప్రవర్తించాడు. ఏనుగును రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు.
అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో అడవులు కొట్టేస్తుండడంతో వన్య ప్రాణాలకు (Wild Animals) ఆహారం, ఆవాసం కరువు అవుతోంది. అడవుల మధ్య నుంచి రోడ్లు వేస్తుండడంతో వన్య ప్రాణులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులు (Elephant) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ జోలికి వస్తే తప్ప ఆగ్రహం ప్రదర్శించని ఏనుగులతో ఓ కుర్రాడు పిచ్చిగా ప్రవర్తించాడు (Man harassing a wild elephant). ఏనుగును రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ తన ఎక్స్ ఖాతా @ParveenKaswanలో ఆ వీడియోను షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొన్ని ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. ఆ సమయంలో ఓ కుర్రాడు ఓ ఏనుగు దగ్గరకు వెళ్లి రెచ్చగొట్టాడు. దీంతో ఆ ఏనుగు ఆ కుర్రాడి వెంటబడింది. అయితే ఆ కుర్రాడు ఆ ఏనుగుకు అందకుండా పరిగెత్తాడు. ఏనుగు ఆగిపోగానే మళ్లీ వెనక్కి వెళ్లి దానిని రెచ్చగొట్టాడు. ఆ వీడియోను షేర్ చేసిన ప్రవీణ్. ``మీరు కుర్రాళ్లు కాబట్టి ఏనుగు కంటే వేగంగా పరిగెత్తగలరు. కానీ, చిరాకులో ఉన్న ఆ ఏనుగు తర్వాత తన తనకు కనిపించిన మనిషిపై ఆగ్రహాన్ని చూపిస్తాయి. వన్య ప్రాణులతో మీ సరదా కోసం ఆటలాడకండి`` అని కామెంట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 17 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ రోడ్డు మీద రెండు జంతువులు ఉన్నాయి``, ``అతడిని వెంటనే అరెస్ట్ చేయాలి``, ``ఇతడు చేసిన పనికి మరొకరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది``, ``ఇది నిజంగా చాలా దారుణం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: మన దేశంలో ఏదైనా సాధ్యమే.. ఆ కొబ్బరి చెట్టును చూస్తే షాక్‌తో కళ్లు తేలెయ్యాల్సిందే..
Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..
Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..
Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..
Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 15 , 2025 | 08:33 AM