Viral Video: ఎంత అందమైన వీడియో.. మంచులో చిరుతపులుల ఆటలు చూడండి.. వీడియో వైరల్..
ABN, Publish Date - Jan 08 , 2025 | 10:03 AM
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. సింహాలు, పులులు, చిరుతలకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు. తాజాగా రెండు చిరుత పులులకు సంబంధించిన అందమైన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. సింహాలు, పులులు, చిరుతలకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు. తాజాగా రెండు చిరుత పులులకు (Leopards) సంబంధించిన అందమైన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. మంచులో ఆ రెండు చిరుతలు ఆడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Viral Video).
ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు తన ఎక్స్ ఖాతా @supriyasahuiasలో ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రెండు చిరుత పులులు మంచులో ఆడుకుంటున్నాయి. లడఖ్‌లోని జంస్కార్ వ్యాలీలో (Zanskar Valley of Ladakh) ఈ వీడియోను చిత్రీకరించారు. మంచుతో నిండిన పర్వతంపై ఆ చిరుతలు రెండూ ఆడుతూ, గెంతుతూ, స్కేటింగ్ చేస్తూ ఆడుకుంటున్నాయి. మనుషుల్లాగానే చిరుతలు కూడా ఆ హిమపాతాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఆ అందమైన దృశ్యాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 42 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 1800 మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా అద్భుత దృశ్యాన్ని చక్కగా చిత్రీకరించారు``, ``జంస్కార్ లోయ స్వర్గం కంటే తక్కువ కాదు``, ``చిరుతలు ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుకుంటున్నాయి``, ``అవి చాలా సంతోషంగా ఉన్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. మాటలను అర్థం చేసుకుని ఎలా రిప్లై ఇస్తోందో చూడండి..
Viral Video: ఇది మెగా స్టంట్.. ఇతడిలా ఎవరూ చేయలేరేమో.. బైక్‌ను గాల్లోకి లేపగానే ఏం జరిగిందో చూడండి..
Optical Illusion Test: మీది చురుకైన చూపు అయితే.. ఈ కుర్రాడి రెండో షూను 9 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 08 , 2025 | 10:03 AM