Share News

Viral Video: ఈ మహాతల్లికి దండం రా స్వామి.. రీల్స్ మత్తులో పిల్లాడిని ఎలా విసిరేసిందో చూడండి..

ABN , Publish Date - Jan 15 , 2025 | 12:41 PM

ప్రస్తుతం పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఆ రీల్స్‌ను సృష్టించి వైరల్ అయ్యేందుకు మరికొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Viral Video: ఈ మహాతల్లికి దండం రా స్వామి.. రీల్స్ మత్తులో పిల్లాడిని ఎలా విసిరేసిందో చూడండి..
Woman making reel

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) చూసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఆ రీల్స్‌ను సృష్టించి వైరల్ అయ్యేందుకు మరికొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తామేం చేస్తున్నారో కూడా కొందరు మర్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ మత్తులో పడి తన కొడుకును విసిరిపారేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@Viralvibes07 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంట్లో ఓ భోజ్‌పురీ పాటకు డ్యాన్స్ వేస్తోంది. ఆ రీల్ ప్రారంభంలో ఆ మహిళ చేసిన పని మాత్రం అందరికీ ఆగ్రహం కలిగిస్తోంది. తను డ్యాన్స్ చేయడానికి అడ్డు వస్తున్న చిన్న కుర్రాడిని చేతులతో పైకి ఎత్తి మంచం మీదకు విసిరి పడేసింది. ఆ కుర్రాడు ఎక్కడ పడ్డాడో కూడా చూడకుండా ఆమె ఉత్సాహంగా డ్యాన్స్‌ను కొనసాగించింది. ఆ కుర్రాడు మంచం మీద పడి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 70 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``అలాంటి వారికి పిల్లలు ఎందుకు?``, ``ఈమె తల్లి అనే పదానికే చెడ్డ పేరు తెస్తోంది``, ``ఆమె రీల్స్ రూపొందించే క్రమంలో బానిసగా మారిపోయింది``, ``ఇలాంటి పిచ్చివాళ్లు ఎంతో మంది ఉన్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Virat Kohli Restaurant: కోహ్లీ రెస్టారెంట్‌లో ఇంత దోపిడీనా?.. ఒక్క మొక్కజొన్న ఖరీదు ఎంతో తెలిస్తే..


Viral Video: అక్కడ రెండు జంతువులు ఉన్నాయి.. ఏనుగుతో యువకుడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం..


Viral Video: మన దేశంలో ఏదైనా సాధ్యమే.. ఆ కొబ్బరి చెట్టును చూస్తే షాక్‌తో కళ్లు తేలెయ్యాల్సిందే..


Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..


Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 15 , 2025 | 12:41 PM