Viral Video: వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. మాటలను అర్థం చేసుకుని ఎలా రిప్లై ఇస్తోందో చూడండి..
ABN, Publish Date - Jan 08 , 2025 | 09:22 AM
మనుషుల ప్రవర్తనను, మాటలను అర్థం చేసుకుని మసులుకోవడం కుక్కలకు అలవాటే. కుక్కల స్థాయిలో కాకపోయినా మరికొన్ని జంతువులు కూడా మనుషులకు మచ్చిక అవుతాయి. అలాంటి వాటిల్లో గుర్రం కూడా ఒకటి. అయితే గుర్రాలు మనుషుల మాటలను అర్థం చేసుకోవడం, అందుకు తగిన జవాబులు ఇవ్వడం మాత్రం చాలా అరుదు.
ఎన్నో వందల ఏళ్ల నుంచి కొన్ని జంతువులు మనుషులకు సన్నిహితంగా మారాయి. అందులో మొదటిది కుక్క. మనుషుల ప్రవర్తనను, మాటలను అర్థం చేసుకుని మసులుకోవడం కుక్కలకు అలవాటే. కుక్కల స్థాయిలో కాకపోయినా మరికొన్ని జంతువులు కూడా మనుషులకు మచ్చిక అవుతాయి. అలాంటి వాటిల్లో గుర్రం (Horse) కూడా ఒకటి. అయితే గుర్రాలు మనుషుల మాటలను అర్థం చేసుకోవడం, అందుకు తగిన జవాబులు ఇవ్వడం మాత్రం చాలా అరుదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ గుర్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది (Viral Video).
rajbakhtiar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను పాకిస్తాన్ (Pakistan)లో చిత్రీకరించారు. ఆ వీడియోలో ఓ గుర్రం పొలంలో నిల్చుని ఉంది. దాంతో ఓ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతడి మాటలను అర్థం చేసుకుంటున్న గుర్రం అతడికి తన సకిలింపులతో సమాధానం ఇస్తోంది. అతడి మాటలకు ప్రతి స్పందనగా తన తలను ఊపుతోంది. కాళ్లతో సంజ్ఞలు ఇస్తోంది. వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Talking Horse).
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.6 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజంగా అద్భుతం``, ``అతడేం చెబుతున్నాడో గుర్రానికి అర్థం అవుతోంది``, ``ఇది మోసం.. పక్కనున్న కుర్రాడు చిటికెలు వేస్తున్నాడు. అప్పుడే గుర్రం అరుస్తూ, కాళ్లను పైకి లేపుతోంది``, ``ఇది ఫేక్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇది మెగా స్టంట్.. ఇతడిలా ఎవరూ చేయలేరేమో.. బైక్‌ను గాల్లోకి లేపగానే ఏం జరిగిందో చూడండి..
Optical Illusion Test: మీది చురుకైన చూపు అయితే.. ఈ కుర్రాడి రెండో షూను 9 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 08 , 2025 | 09:22 AM