Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:51 PM
వేడి వేడి పకోడీలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. రోడ్ల పక్కన పెట్టే బజ్జీ బళ్ల దగ్గర చాలా మంది పకోడీలను తింటూ కనిపిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. పకోడీలు వేసే దగ్గర జనం మూగుతున్న తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

సాధారణంగా చాలా మంది సాయంత్రం అయితే స్నాక్స్ (Snacks) తినేందుకు ఇష్టపడుతుంటారు. బజ్జీలు, నూడిల్స్, పానీపూరీ వంటి మోడర్న్ స్నాక్స్ తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అలాగే వేడి వేడి పకోడీలను (Pakodas) కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. రోడ్ల పక్కన పెట్టే బజ్జీ బళ్ల దగ్గర చాలా మంది పకోడీలను తింటూ కనిపిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. పకోడీలు వేసే దగ్గర జనం మూగుతున్న తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పకోడీలు వేయించే ప్రదేశంలో చాలా మంది నిలబడి ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లోనూ వార్తా పత్రిక ముక్కలు ఉన్నాయి. పకోడీలు తయారు చేసిన తర్వాత వాటిని బయటకు తీయడానికి సిద్ధమవుతుండగా అతడి చుట్టు జనాలు పోగయ్యారు. అతను వాటిని పూర్తిగా బయటకు తీయకముందే జనాలు పకోడీల కోసం పోటీలు పడడం మొదలైంది. ఆ వీడియో ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేదు. కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``జీవితం పోవచ్చు. కానీ, పకోడీ పోకూడదు``, ``పకోడీల కోసం నా ప్రాణాలనైనా వదులుకుంటాను``, ``అక్కడ ఉచితంగా పకోడీలను ఇస్తున్నారా``, ``అక్కడ పకోడీలు అంత రుచికరంగా ఉంటాయా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
Viral Video: గూగుల్ మ్యాప్స్‌కే షాకిచ్చాడుగా.. కుంభమేళాలో ఓ వ్యక్తి విచిత్ర ఆలోచన.. నెటిజన్లు ఫిదా..
Kerala Anganwadis: బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి.. చిన్నారి కోరిక.. కేరళ అంగన్వాడీ మెనూపై రివ్యూ..
Viral Business idea: బిజినెస్ ఐడియా అంటే ఇలా ఉండాలి.. కొన్ని రోజుల్లో అంబానీని దాటేస్తాడేమో..
Optical Illusion: ఈ అడవిలో పాము ఎక్కడుంది.. మీ దృష్టి షార్ప్ అయితేనే 6 సెకెన్లలో కనిపెట్టగలరు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి