Virat Kohli Restaurant: కోహ్లీ రెస్టారెంట్‌లో ఇంత దోపిడీనా?.. ఒక్క మొక్కజొన్న ఖరీదు ఎంతో తెలిస్తే..
ABN, Publish Date - Jan 15 , 2025 | 12:16 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి రెస్టారెంట్ చైన్‌ల బిజినెస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు మెట్రో నగరాల్లో కోహ్లీకి రెస్టారెంట్లు ఉన్నాయి. ``వన్ 8 కమ్యూన్`` పేరుతో ముంబై, బెంగళూరు, పుణె, కోల్‌కతా వంటి నగరాలలో రెస్టారెంట్‌లు ఉన్నాయి.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆదాయం కళ్లు చెదిరే రీతిలో ఉంటుంది. ఆట ద్వారా మాత్రమే కాదు.. ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడులు, వ్యాపారం.. ఇలా ఎన్నో మార్గాల ద్వారా కోహ్లీ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక, కోహ్లీ సోషల్ మీడియాలో కేవలం ఒక్క పోస్ట్ చేస్తే చాలు కోట్లలో సంపాదన వచ్చిపడుతుంది. విరాట్ కోహ్లీకి రెస్టారెంట్ చైన్‌ల బిజినెస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని పలు మెట్రో నగరాల్లో కోహ్లీకి రెస్టారెంట్లు ఉన్నాయి. ``వన్ 8 కమ్యూన్`` (one8 commune) పేరుతో ముంబై, బెంగళూరు, పుణె, కోల్‌కతా వంటి నగరాలలో రెస్టారెంట్‌లు ఉన్నాయి (Virat Kohli Restaurant).
గతేడాది మే నెలలో హైదరాబాద్‌లో కూడా ``వన్ 8 కమ్యూన్`` రెస్టారెంట్‌ను కోహ్లీ ఓపెన్ చేశాడు. హైటెక్ సిటీ లోని నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఈ వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ఈ రెస్టారెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థిని ఒకరు సోమవారం ఈ రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ ఆమె ఓ ప్లేట్ ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులు (Boiled Corn) తీసుకుంది. దానిని తిన్న తర్వాత బిల్లు చూసి ఆమె షాకైంది. ఎందుకంటే కేవలం ఒక్క ప్లేట్ బాయిల్డ్ కార్న్‌కు రెస్టారెంట్ ఏకంగా రూ.525 రూపాయల బిల్లు వేసింది.
ఆ బిల్లును ఫొటో తీసి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ``విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌లో ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తుల కోసం ఏకంగా రూ.525 చెల్లించాను`` అంటూ కామెంట్ చేసింది. ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 13 లక్షల మంది ఆ ట్వీట్‌ను వీక్షించారు. 11 వేల మందికి పైగా ఆమె ట్వీట్‌ను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``మీరు చెల్లించిన బిల్లు మొక్కజొన్న కోసం కాదు.. ఆ పరిసరాల కోసం``, ``అలాంటి రెస్టారెంట్లకు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అక్కడ రెండు జంతువులు ఉన్నాయి.. ఏనుగుతో యువకుడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం..
Viral Video: మన దేశంలో ఏదైనా సాధ్యమే.. ఆ కొబ్బరి చెట్టును చూస్తే షాక్‌తో కళ్లు తేలెయ్యాల్సిందే..
Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..
Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 15 , 2025 | 12:42 PM