Ruthuraj Gaikwad: ఆర్ఆర్‌తో ఓటమికి కారణం అదే.. సీఎస్‌కే కెప్టెన్

ABN, Publish Date - Mar 31 , 2025 | 10:08 AM

తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించలేకపోవడం, ఫీల్డింగ్‌లో లోపాలే ఆర్ఆర్‌తో ఓటమికి కారణమని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.

Ruthuraj Gaikwad: ఆర్ఆర్‌తో ఓటమికి కారణం అదే.. సీఎస్‌కే కెప్టెన్

ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తాజా సీజన్‌లో మాత్రం దారుణంగా తడబడుతోంది. సొంత మైదానంలో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం తరువాత ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌‌ చేతిలో కూడా పరాజయం పాలైంది. వరుస ఓటములపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించారు. ప్రారంభంలో తమ బ్యాటర్ల తడబాటు, ఫీల్డింగ్ లోపాలు తమ ఓటమికి దారి తీశాయని అన్నాడు.

Also Read: వార్న్‌ మృతిలో కొత్త కోణం!


‘‘మ్యాచ్ ప్రారంభంలో గొప్పగా ఆడలేకపోతున్నాము. ఫీల్డింగ్ తప్పుల కారణంగా మరో 8 - 10 పరుగులు ప్రత్యర్థికి ఇచ్చుకున్నాము. ఈ అంశాల్లో మేము మెరుగుపడాల్సి ఉంది’’ అని రుతురాజ అన్నాడు. ఇక నెం.3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగడంపై కూడా రుతురాజ్ మాట్లాడాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇలా చేశానని చెప్పాడు. ‘‘ఇంతకాలం మూడో స్థానంలో అజింక్యా వచ్చే వాడు. మిడిల్ ఓవర్స్‌ను రాయుడు చూసుకునేవాడు. దీంతో, కాస్త లేటుగా మ్యాచ్‌లోకి వచ్చి జట్టుకు స్థిరత్వం చేకూర్చేందుకు నేను ప్రయత్నిస్తే, మొదట్లో త్రిపాఠీ దిగితే బాగుంటుందని అనుకున్నాము’’ అని చెప్పాడు. ఆక్షన్ సందర్భంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, తనకు ఏ సమస్యా లేదని కూడా చెప్పాడు.


Also Read: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్

ఇక తమ గెలుపుపై ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఓ 20 పరుగులు తక్కువగా చేశామని అనిపించింది. మిడిల్ ఓవర్స్‌లో బాగానే ఆడినా ఆ తరువాత కొన్ని వికెట్లు వేగంగా కోల్పోయాము. కానీ బౌలర్లు మా ప్లాన్‌ను చక్కగా అమలు చేశారు. గత రెండు మ్యాచులు చాలా కఠినంగా ఉన్నాయి. ఈ విజయం మాకు అత్యవసరం’’ అని అన్నాడు. ఆర్ఆర్ టీం ఫీల్డింగ్‌ వల్ల 20 పరుగుల మేర లాభం కలిగిందని చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 10:08 AM