బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:10 AM
ఈ సీజన్ ఐపీఎల్ నుంచి చివరి నిమిషంలో వైదొలగిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది. అతడు రెండేళ్లపాటు...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ నుంచి చివరి నిమిషంలో వైదొలగిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది. అతడు రెండేళ్లపాటు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని బీసీసీఐ గురువారం ప్రకటించింది. అంతేకాదు..బ్రూక్‌పై చర్యల విషయాన్ని ఆ క్రికెటర్‌తోపాటు, ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసింది. గత ఏడాది నవంబరులో జరిగిన వేలంలో రూ. 6.25 కోట్ల ధరకు హ్యారీని ఢిల్లీ క్యాపిటల్ కొనుగోలు చేసిన విషయం విదితమే.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 14 , 2025 | 03:10 AM