ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma : రిటైర్మెంట్‌ కాదు

ABN, Publish Date - Jan 05 , 2025 | 06:09 AM

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిశ్బబ్ధాన్ని వీడాడు. తన రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టాడు. పేలవ ఫామ్‌ వల్లే సిడ్నీ టెస్ట్‌ నుంచి వైదొలిగానని స్పష్టంజేశాడు. ‘నేను రిటైర్‌ కాలేదు.

ఫామ్‌లో లేను

అందుకే వైదొలిగా

రోహిత్‌ స్పష్టీకరణ

సిడ్నీ: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిశ్బబ్ధాన్ని వీడాడు. తన రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టాడు. పేలవ ఫామ్‌ వల్లే సిడ్నీ టెస్ట్‌ నుంచి వైదొలిగానని స్పష్టంజేశాడు. ‘నేను రిటైర్‌ కాలేదు. ఐదో టెస్ట్‌ నుంచి పక్కకు తప్పుకొన్నానంతే. కోచ్‌, సెలెక్టర్లతో నేను పెద్దగా చర్చించింది ఏమీ లేదు. నేను ఆశించిన స్థాయిలో పరుగులు చేయడంలేదు. సిడ్నీ మ్యాచ్‌ మాకు ఎంతో ముఖ్యమైనది. అందువల్ల ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఆడించాల్సి వచ్చింది’ అని శనివారం ఇక్కడ ఓ క్రీడా చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్‌ వెల్లడించాడు. ‘నా రిటైర్మెంట్‌పై పుంఖానుపుంఖాలుగా వార్తలొస్తున్నాయి. కానీ నేను వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. ఐదు నెలలుగా పరిస్థితులు అనుకూలించడంలేదు. క్రికెట్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశా. జీవితం రోజురోజుకు.. నిమిషానికి మారుతుంటుంది. అయితే పరిస్థితులు కూడా మారతాయని బాగా నమ్ముతా. అదే సమయంలో మనం వాస్తవికంగా కూడా ఆలోచించాలి’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. ‘ఫామ్‌లో లేని ఆటగాళ్లు జట్టులో ఎక్కువమంది ఉండకూడదని ఆలోచించా. అంతేతప్ప జట్టును వీడి నేను ఎక్కడికీ వెళ్లడంలేదు’ అని ప్రకటించాడు. తన స్థానంలో సారథిగా వ్యవహరిస్తున్న బుమ్రాపై రోహిత్‌ ప్రశంసలు కురిపించాడు. ‘బంతితో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. 2013లో బుమ్రాను మొదటిసారి చూసినప్పటికీ ఇప్పటికీ అతడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు’ అని కొనియాడాడు.

Updated Date - Jan 05 , 2025 | 06:09 AM