మతం మారనందుకే.. కెరీర్ నాశనం!
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:53 AM
పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి ఆదేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా (44) సంచలన విషయాలు బయటపెట్టాడు. మతం మారనందుకే తన కెరీర్‌ను....

పాక్ మాజీ క్రికెటర్ కనేరియా
న్యూయార్క్: పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి ఆదేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా (44) సంచలన విషయాలు బయటపెట్టాడు. మతం మారనందుకే తన కెరీర్‌ను నాశనం చేశారని ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కనేరియా వాపోయాడు. మైనారిటీగా పాక్‌లో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పాడు. షాహిద్ అఫ్రీది కెప్టెన్‌గా ఉన్నప్పుడు తనను మతం మారమని తీవ్రంగా ఒత్తిడి చేసేవాడని తెలిపాడు. అయితే ఇంజమామ్ ఒక్కడే తనకు మద్దతుగా నిలిచాడన్నాడు. అఫ్రీది, షోయబ్ అక్తర్ ఎవరూ తనతో కలసి తినేవారు కూడా కాదన్నాడు. పాక్ తరఫున డానిష్ 61 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 14 , 2025 | 03:53 AM