Ind vs Aus: టీమిండియా టార్గెట్ 265.. స్పిన్నర్లను ఎదుర్కోవడమే కీలకం..
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:01 PM
ఆస్ట్రేలియా జట్టు 264 పరుగులు చేసి టీమిండియా ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ పిచ్ మీద ఈ టోర్నీలో ఆస్టేలియా సాధించిన ఈ 264 పరుగులే అధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కూడా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చే బాధ్యత ఇక బ్యాటర్లపైనే ఉంది. బౌలర్లు చక్కగా రాణించి ఆస్ట్రేలియా జట్టును 264 పరుగులకే కట్టడి చేశారు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో పోల్చుకుంటే పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. ఆసీస్ బ్యాటర్లు సమన్వయంతో భాగస్వామ్యాలను నిర్మిస్తూ పరుగులు రాబట్టారు. అలాగే టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తే ఆసీస్ భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశారు. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. భారత్ ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. (Ind vs Aus)
ఓపెనర్ ట్రావిస్ హెడ్ (39) మెరుపు ఆరంభాన్ని అందించాడు. స్టీవ్ స్మిత్ స్పిన్‌ను తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అద్భుతమైన టైమింగ్‌తో బౌండరీలు కొట్టాడు. ఇక, చివర్లో అలెక్స్ క్యారీ తన వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. మిడిలార్డర్‌లో లంబుషేన్ (29) కూడా రాణించాడు. అద్భుతమైన సిక్స్ కొట్టిన మ్యాక్స్‌వెల్ (7) తర్వాత బంతికే బౌల్డ్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడ వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరాలంటే టీమిండియా బ్యాటర్లు చెమటోడ్చాల్సిందే. ఈ పిచ్ మీద ఈ టోర్నీలో ఆస్టేలియా సాధించిన ఈ 264 పరుగులే అధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కూడా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. స్పిన్నర్లను టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దాని పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ముఖ్యంగా రోహిత్, గిల్ మెరుపు ఆరంభంతో పాటు కోహ్లీ, అయ్యర్ రాణిస్తేనే ఈ మ్యాచ్‌లో గెలుపు సాధ్యమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..