Ajinkya Rahane: నేను మాట్లాడితే కొట్లాట గ్యారెంటీ.. రహానె సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:20 AM
IPL 2025: కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మాట్లాడితే చాలు గొడవ మొదలవుతుందని అన్నాడు. రహానె వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..

సక్సెస్ పట్టాలు ఎక్కినట్లే కనిపించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్ తాజా సీజన్‌లో మరో ఓటమిని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జియాంట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో తృటిలో విజయాన్ని దూరం చేసుకుంది కేకేఆర్. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 238 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 234 పరుగులు చేయగలిగింది కోల్‌కతా. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ కెప్టెన్ అజింక్యా రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తానేం మాట్లాడినా కొట్లాట తప్పదని అన్నాడు. మరి.. రహానె ఎందుకిలా అన్నాడు అనేది ఇప్పుడు చూద్దాం..
పబ్లిసిటీ వచ్చిందిగా..
ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్‌తో వివాదంపై రహానె మరోమారు స్పందించాడు. ఈ కాంట్రవర్సీ వల్ల పిచ్ క్యూరేటర్‌కు మంచి పబ్లిసిటీ వచ్చిందన్నాడు. దీంతో ఆయన చాలా హ్యాపీగా ఉండొచ్చునని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు కేకేఆర్ కెప్టెన్. ఈ విషయాన్ని మీడియా చాలా పెద్దగా చేసి చూపించిందని సెటైర్స్ వేశాడు. ఇప్పుడు గానీ తాను ఏమైనా అంటే.. దాన్ని బిగ్ కాంట్రవర్సీ చేస్తారని రహానె చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో తమకు అనుకూలంగా వికెట్‌ను తయారు చేయాల్సిందిగా ఈడెన్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది. కానీ అందుకు ఆయన సున్నితంగా నో చెప్పాడు. దీంతో కేకేఆర్ వర్సెస్ ముఖర్జీ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది.
మాట వినే ప్రసక్తే లేదు
వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లు టీమ్‌లో ఉన్నందున స్పిన్ వికెట్ తయారు చేయాల్సిందిగా ముఖర్జీని రహానె కోరాడు. అందుకు ఆయన నో చెప్పడమే గాక బ్యాటింగ్ వికెట్ తయారు చేశాడు. అంతేగాక తాను పిచ్ క్యూరేటర్‌గా ఉన్నంత కాలం వికెట్ మారబోదంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు. పిచ్ మార్చే హక్కు ఫ్రాంచైజీలకు ఉండదని స్పష్టం చేశాడు. దీనిపై నిన్న లక్నోతో మ్యాచ్ తర్వాత రహానె రియాక్ట్ అయ్యాడు. క్యూరేటర్‌కు ఫుల్ పబ్లిసిటీ వచ్చిందన్నాడు. హోమ్ అడ్వాంటేజ్ లాంటిదేమీ లేదని.. తాము కోరినట్లు వికెట్ తయారు చేయడం లేదన్నాడు. ఈ నేపథ్యంలో క్యూరేటర్ మాట వినడం లేదు కాబట్టి కావాలనుకుంటే కేకేఆర్ తమ హోమ్ గ్రౌండ్‌గా ఇతర స్టేడియాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ కాంట్రవర్సీ ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి