IPL 2025 SRH: సన్‌రైజర్స్‌కు ఫెస్టివల్ ఫీవర్.. ఆశలన్నీ హనుమయ్య మీదే..
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:44 PM
SRH vs PBKS: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త భయం పట్టుకుంది. అదే ఫెస్టివల్ ఫీవర్. పండుగుల పేరు చెబితే చాలు.. తెలుగు టీమ్ వణుకుతోంది. అందుకే బజరంగబలిని నమ్ముకుంటోంది ఆరెంజ్ ఆర్మీ. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

పండుగల పేర్లు చెబితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఫెస్టివల్స్ నాడు ఫుల్ ఎంజాయ్ చేద్దామని చూస్తారు. చాలా మంది పండుగ నాడు మొదలుపెట్టే పనులు సక్సెస్ అవుతాయని నమ్ముతారు. అయితే సన్‌రైజర్స్ టీమ్ మాత్రం ఫెస్టివల్ అనే పదం వినిపిస్తే చాలు భయపడుతోంది. దీనికి కారణం గత వారం రోజుల వ్యవధిలో 2 పండుగలకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆరెంజ్ ఆర్మీ ఓడిపోవడమే. మార్చి 30వ తేదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖ తీరాన మ్యాచ్‌లో పరాభవం పాలైంది ఎస్‌ఆర్‌హెచ్.
బిగ్ టాస్క్
ఉగాది నాడు డీసీ చేతుల్లో ఓటమి దెబ్బ నుంచి కోలుకోకముందే ఏప్రిల్ 6న సన్‌రైజర్స్‌కు మరో గట్టి షాక్ తగిలింది. శ్రీ రామ నవమి పర్వదినాన గుజరాత్ టైటాన్స్‌తో తలపడి మరోమారు ఓటమిని చవిచూసింది కమిన్స్ సేన. దీంతో పండుగ అంటే అటు ఆటగాళ్లతో పాటు ఇటు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా భయపడిపోతున్నారు. అయితే తక్కువ గ్యాప్‌లో మరో ఫెస్టివల్ చాలెంజ్‌ను ఎదుర్కోనుంది సన్‌రైజర్స్. హనుమాన్ జయంతి రూపంలో ఏప్రిల్ 12వ తేదీన ఎస్‌ఆర్‌హెచ్ కోసం బిగ్ టాస్క్ ఎదురు చూస్తోంది.
టెన్షన్ ఎందుకు దండగ..
సన్‌రైజర్స్ ఈ నెల 12న ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోయే మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇదే రోజు హనుమాన్ జయంతి కావడంతో ఈసారి ఏమవుతుందోనని కొందరు ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే బజరంగబలి ఆశీస్సులు సన్‌రైజర్స్ మీద ఉంటాయని.. ఓటముల నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆ హనుమంతుడు బయటపడేస్తారని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఆయన కృపతో కమిన్స్ సేన గాడిన పడి.. ట్రోఫీ రేసులో పరుగుల పెట్టడం ఖాయమని చెబుతున్నారు. అభిమానులు టెన్షన్ పడకుండా పండుగ సంబురాలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆంజనేయుడు ఉన్నాడు.. బేఫికర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి సక్సెస్ ట్రాక్ అందుకుందా.. ఆరెంజ్ ఆర్మీని ఎవ్వరూ ఆపలేరని, ఈసారి కప్పు మనదేనని నమ్మకంగా చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ప్రీతి జింటా సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ వైరల్
11 క్యాచులు మిస్.. ఈ టీమ్ అస్సాంకే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి