IPL 2025: పది ఓవర్లు పూర్తి.. చిక్కుల్లో సీఎస్కే

ABN, Publish Date - Mar 28 , 2025 | 10:35 PM

సీఎస్కే చిక్కుల్లో పడింది. వరుసగా వికెట్లో కోల్పోవడంతో రన్ రేట్ భారీగా పతనమైంది.

IPL 2025: పది ఓవర్లు పూర్తి.. చిక్కుల్లో సీఎస్కే

ఇంటర్నెట్ డెస్క్: ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సీఎస్కే చిక్కుల్లో పడింది. ప్రారంభ ఓవర్లోనే నాలుగు కీలక వికెట్ల కోల్పోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. పేసర్ జాష్ హేజల్‌వుడ్ రెండో ఓవర్లోనే త్రిపాఠీ, రుతురాజ్ గైక్వాడ్ వికెట్లు తీసి సీఎస్కేను దారుణంగా దెబ్బకొట్టాడు. ఆ తరువాత భువనేశ్వర్ బౌలింగ్‌లో దీపక్ హుడా పెవిలియన్ బాటపట్టాడు. ఇలా కీలక వికెట్లు పడటంతో రన్‌రేట్‌పై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు, నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్ర ఆర్ధ సెంచరీ దిశగా ముందుకెళుతున్నాడు. లక్ష్య ఛేదనకు తన వంతు పాటు పడుతున్నాడు. ఇక పన్నెండు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కకే కేవలం 75 పరుగులే చేయగలిగింది.


ఇక ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పిక్కల్ ఇన్నింగ్స్ ఆర్సీబీకి భారీగా లాభించింది. చివర్లో టిమ్ డేవిడ్ వరుస సిక్సులతో రన్ రేట్ పీక్స్‌కు చేరి భారీ లక్ష్యాన్ని సీఎస్కే ముందుచగలిగింది. ఆ తరువాత స్పిన్నర్స్ ధాటిగా బౌలింగ్ చేయడంతో సీఎస్కేకు చిక్కులు ఎదురవుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2025 | 11:57 PM