IPL 2025 CSK vs RCB Live: ముగిసిన ఆర్సీబీ ఇన్నింగ్స్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే..
ABN, Publish Date - Mar 28 , 2025 | 09:33 PM
కీలక వికెట్లు కోల్పోతున్నా ఆర్సీబీ మంచి స్కోరు సాధించింది. సీఎస్కే ముందు 197 లక్ష్యాన్ని ముందుంచింది.
ఇంటర్నెట్ డెస్క్: కీలక వికెట్లు కోల్పోతున్నా ఆర్సీబీ మంచి స్కోరు సాధించింది. సీఎస్కే ముందు 197 లక్ష్యాన్ని ముందుంచింది. ప్రారంభంలోనే సాల్ట్ (16 బంతుల్లో 32 పరుగులు) దూకుడుగా ఆడటంతో ఆర్సీబీకి శుభారంభం దక్కింది. కానీ అతడు త్వరగా పెవిలియన్ బాట పట్టడంతో కోహ్లీతో భాగస్వామ్యం భారీ స్కోరుగా మారలేదు. ఆ తరువాత వచ్చి ప్లేయర్స్ ఓవర్‌కు ఒకటో రెండో బౌండరీలు తీస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఇక ఆర్సీబీ కెప్టెన్ రజన్ పటీదార్ ఈ ఇన్నింగ్స్‌లో కీలకంగా మారాడు. అర్ధ సెంచరీ చేసి నిలకడ అయిన ఆటతీరును కనబరిచాడు. దీంతో, చివరి ఓవర్లలో ఆర్సీబీ స్కోరు పరుగులు పెట్టింది. ఇక దేవ్‌దత్ పడిక్కల్ (14 బంతుల్లో 27 పరుగులు) కూడా ఆర్సీబీకి లాభించింది. చివరి ఓవర్లలో టిమ్ డేవిడ్ మెరుపులు ( 8 బంతుల్లో 22 పరుగులు, హ్యాట్రిక్ సిక్సులు) స్కోరు బోర్డును ఒక్కసారిగా పరుగులు పెట్టించాయి. దీంతో, ఆర్సీబీ తన ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులతో ముగించింది. ఇక బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు మూడు వికెట్లు, పతిరన రెండు వికెట్లు దక్కించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 28 , 2025 | 11:57 PM