Share News

DC vs MI IPL 2025: డీసీపై ముంబై ఘన విజయం

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:35 PM

ఉత్కంఠ పోరులో డీసీపై ముంబై ఘన విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలుపొందింది.

DC vs MI IPL 2025: డీసీపై ముంబై ఘన విజయం
MI Victory over DC

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై అనూహ్యంగా బ్రేకులు వేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. తమ అభిమాన వరుస ఓటముల చూసి డీలా పడ్డ ఫ్యాన్స్‌లో ముంబై ఇండియన్స్ ఈ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలవడంతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాప్ స్కోరర్ తిలక్ వర్మతో (33 బంతుల్లో 59 పరుగులు) పాటు, రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు, ముఖేశ్ ఒక వికెట్ తీశారు.


ఆ తరువాత బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కరుణ్ నాయర్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89 పరుగులు) నిరుపయోగంగా మారింది. ఢిల్లీ ముంబై ఇంపాక్ట్ సబ్ కర్ణ శర్మ జట్టు గెలుపులో కీక పాత్ర పోషించారు. ఏకంగా మూడు వికెట్లు తీసి ముంబై పతనానికి నాంది పలికాడు. అతడి బౌలింగ్‌లో అభిషేక్ పొరేల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత నుంచి డీసీ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ముంబై జస్పిత్ బుమ్రా బౌలింగ్‌లో 18వ ఓవర్‌లో రనౌట్లకు ముగ్గురు బ్యాటర్లను కోల్పోయి చివరకు ఓటమి చవి చూసింది.

ఇవీ చదవండి:

సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఆర్సీబీ

కోహ్లీ సంచలన రికార్డు

ఆర్సీబీలో కాటేరమ్మ కొడుకు..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 12:00 AM