హ్యాట్రిక్‌ విజయాల్లో ఢిల్లీ.. ఓటముల్లో చెన్నై

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:56 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కొనసాగిస్తూ ఈ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓటములలో హ్యాట్రిక్‌ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ 25 పరుగులతో...

హ్యాట్రిక్‌  విజయాల్లో ఢిల్లీ.. ఓటముల్లో చెన్నై

రాణించిన రాహుల్‌

25 పరుగులతో సూపర్‌కింగ్స్‌ చిత్తు

చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కొనసాగిస్తూ ఈ ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓటములలో హ్యాట్రిక్‌ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ 25 పరుగులతో చెన్నైని ఓడించింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 183/6 స్కోరు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) సొగసైన హాఫ్‌ సెంచరీ చేశాడు. అభిషేక్‌ పోరెల్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 33) సత్తా చాటాడు. స్టబ్స్‌ (24), కెప్టెన్‌ అక్షర్‌ పేటల్‌ (21) ఫర్వాలేదనిపించారు. ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 158/5కే పరిమితమైంది. విజయ్‌ శంకర్‌ (54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 69 నాటౌట్‌), ధోనీ (26 బంతుల్లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌తో 30 నాటౌట్‌) మాత్రమే రాణించారు. విప్రాజ్‌ 2 వికెట్లు తీశాడు. కేఎల్‌ రాహుల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


మారని సీఎ్‌సకే బ్యాటింగ్‌: మరోసారి చెన్నై బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్‌ రచిన్‌ (3)తోపాటు జట్టులోకి వచ్చిన కాన్వే (13), కెప్టెన్‌ రుతురాజ్‌ (5) విఫలం కావడంతో పవర్‌ ప్లేలో 46/3తో నిలిచిన సీఎస్‌కే ఆపై ఏ దశలోనూ పోటీలోకి రాలేకపోయింది. శివమ్‌ దూబే (18), జడేజా (2) నిరాశపరిచారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన ధోనీ, విజయ్‌ శంకర్‌ ఆరో వికెట్‌కు అభేద్యంగా 84 పరుగులు చేయడం ఓటమిలో చెన్నై జట్టుకు ఒకింత ఊరట.

కేఎల్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌: టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా..కేఎల్‌ రాహుల్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండు అర్ధ శతక భాగస్వామ్యాలతో జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచాడు. అభిషేక్‌ పోరెల్‌తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు, సమీర్‌ రిజ్వీ (20)తో కలిసి నాలుగో వికెట్‌కు 56 రన్స్‌ జోడించాడు.


స్కోరుబోర్డు

ఢిల్లీ: ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌ (సి) అశ్విన్‌ (బి) ఖలీల్‌ 0, కేఎల్‌ రాహుల్‌ (సి) ధోనీ (బి) పథిరన 77, అభిషేక్‌ పొరెల్‌ (సి) పథిరన (బి) జడేజా 33, అక్షర్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 21, రిజ్వి (సి) జడేజా (బి) ఖలీల్‌ 20, స్టబ్స్‌ (నాటౌట్‌) 24, అశుతోష్‌ (రనౌట్‌) 1, విప్రాజ్‌ నిగమ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 183/6; వికెట్ల పతనం: 1-0, 2-54, 3-90, 4-146, 5-179, 6-180; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-25-2, ముకేశ్‌ చౌదరి 4-0-50-0, అశ్విన్‌ 3-0-21-0, జడేజా 2-0-19-1, నూర్‌ అహ్మద్‌ 3-0-36-1, పథిరన 4-0-31-1.

చెన్నై: రచిన్‌ (సి అండ్‌ బి) ముకేశ్‌ కుమార్‌ 3, కాన్వే (సి) అక్షర్‌ (బి) విప్రాజ్‌ 13, రుతురాజ్‌ (సి) ఫ్రేజర్‌ (బి) స్టార్క్‌ 5, విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 69, శివమ్‌ దూబే (సి) స్టబ్స్‌ (బి) విప్రాజ్‌ 18, జడేజా (ఎల్బీ) కుల్దీప్‌ 2, ధోనీ (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 158/5; వికెట్ల పతనం: 1-14, 2-20, 3-41, 4-65, 5-74; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-27-1, ముకేశ్‌ కుమార్‌ 4-0-36-1, మోహిత్‌ 3-0-27-0, విప్రాజ్‌ నిగమ్‌ 4-0-27-2, కుల్దీప్‌ 4-0-30-1, అక్షర్‌ 1-0-5-0.

15

2010 తర్వాత..అంటే 15 ఏళ్ల అనంతరం తొలిసారి చెన్నై వేదికగా సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ గెలిచింది.


మహీ.. మెరుపు వేగంతో..

అశుతోష్‌ను రనౌట్‌ చేస్తున్న ధోనీ

43 ఏళ్ల ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో ఈ ఐపీఎల్‌లో కళ్లు మూసి తెరిచేలోపు రెండు స్టంపింగ్‌లు చేయడం ద్వారా చూశాం. అలాగే ఢిల్లీతో మ్యాచ్‌లో అశుతోష్‌ శర్మ (1)ను అంతే వేగంగా రనౌట్‌ చేశాడు. పథిరన వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ మూడో బంతిని ఢిల్లీ బ్యాటర్‌ అశుతోష్‌ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా కొట్టి మొదటి పరుగు తీశాడు. అతను రెండో పరుగుకోసం వస్తుండగా బంతిని ఫీల్డ్‌ చేసిన జడేజా వికెట్‌ కీపర్‌ వైపు విసిరాడు. అప్పటికి వికెట్లకు దూరంగా ఉన్న ధోనీ మెరుపు వేగంతో కదిలాడు. జడేజా విసిరిన బంతిని అందుకొని క్షణాల్లో వికెట్లను గిరాటేశాడు. దాంతో అశుతోష్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 04:56 AM