హారికకు తొలి ఓటమి
ABN, Publish Date - Mar 20 , 2025 | 03:54 AM
ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో..

నికోసియా (సైప్రస్): ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ఎలిజబెత్ పెహెట్జ్ చేతిలో హారిక పరాజయం పాలైంది. నల్లపావులతో ఆడిన హారిక 50 ఎత్తుల అనంతరం ఓటమిని అంగీకరించింది. కాగా, ననా డిజాంగ్‌నిడ్జీ (జార్జియా)తో గేమ్‌ను దివ్య దేశ్‌ముఖ్ డ్రాగా ముగించింది. ఐదు రౌండ్ల తర్వాత హారిక 2.5, దివ్య 2 పాయింట్లతో ఉన్నారు.
Updated Date - Mar 20 , 2025 | 03:54 AM