అంతర్జాతీయ క్రికెట్‌కు గప్తిల్ గుడ్ బై
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:07 AM
తెల్లబంతుల ఫార్మాట్‌లో తిరుగులేని న్యూజిలాండ్ బ్యాటర్‌గా పేరుపొందిన మార్టిన్ గప్తిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్తిల్ 2009 నుంచి 2022 వరకు 14 ఏళ్ల పాటు కివీస్ జట్టుకు...
తెల్లబంతుల ఫార్మాట్‌లో తిరుగులేని ఓపెనర్
వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
ఆక్లాండ్: తెల్లబంతుల ఫార్మాట్‌లో తిరుగులేని న్యూజిలాండ్ బ్యాటర్‌గా పేరుపొందిన మార్టిన్ గప్తిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్తిల్ 2009 నుంచి 2022 వరకు 14 ఏళ్ల పాటు కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈక్రమంలో 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్ట్‌లు ఆడాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ కుడిచేతి వాటం ఓపెనర్ మెరుపులు చూసి తీరాల్సిందే. టీ20లలో 3531 పరుగులు చేసిన మార్టిన్..ఈ ఫార్మాట్‌లో అత్యధిక రన్స్ సాధించిన టాప్ న్యూజిలాండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డేలలో 7346 రన్స్‌తో రాస్ టేలర్ (8607), స్టీఫెన్ ఫ్లెమింగ్ (8007) తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో కివీస్ బ్యాటర్ గప్తిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో 367 మ్యాచ్‌లు ఆడిన అతడు అన్నింటిలో కలిపి 23 సెంచరీలు సాధించాడు.
ఇక..2015 వన్డే వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై క్వార్టర్ ఫైనల్లో మార్టిన్ డబుల్ సెంచరీ (163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో 237 నాటౌట్)తో కదం తొక్కాడు. తద్వారా వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక రన్స్ చేసిన రికార్డును ఇప్పటికీ తన పేరిట నమోదు చేశాడు. అలాగే ఓవరాల్‌గా వన్డేలలో అది రెండో అత్యధిక స్కోరు కూడా. 2022లో చివరిసారి కివీ్‌సకు ఆడాడు. కివీస్ దేశవాళీ క్రికెట్‌లో ఆక్లాండ్ ఏసె్‌సకు ప్రాతినిధ్యం వహిస్తున్న గప్తిల్ టీ20 ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతానని ప్రకటించాడు. ‘న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడాలనేది నా కల. అలాంటిది నా దేశానికి ఏకంగా 350కిపైగా మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా ఉంది’ అని గప్తిల్ పేర్కొన్నాడు.
Updated Date - Jan 09 , 2025 | 02:07 AM