ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

LSG Vs GT: లఖ్‌నవూ లక్ష్యం ఎంతంటే..

ABN, Publish Date - Apr 12 , 2025 | 05:52 PM

లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జీటీ ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మొదట్లో జీకి మంచి ఆరంభం దక్కినా ఆ తరువాత ఎల్ఎస్‌జీ స్పిన్నర్లు రాణించడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

IPL 2025 LSG Vs GT Live

అసక్తికరంగా మొదలైన గుజరాత్ టైటన్స్ (జీటీ) వర్సెస్ లఖ్నవూ సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మ్యాచ్‌లో జీటీ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచిన లఖనవూ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (60), సాయి సుదర్శన్ అద్భుత ఆరంభాన్ని (56) ఇచ్చారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 12 ఓవర్లకు 120 పుగులు చేసి పటిష్ఠ స్థితిలో కనిపించింది. ఆ తరువాత కీలక సమయంలో వికెట్లు కోల్పోయి ఇక్కట్ల పాలై చివరకు 180 పరుగులకే పరిమితమైంది.


రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ స్పిన్ ద్వయం చివరి ఓవర్లలో గుజరాత్ స్పీడుకు బ్రేకులు వేశారు. ఆ తరువాత అవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూరు కూడా చివరి ఓవర్లలో పరుగులకు అడ్డుకట్ట చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, రవి బిష్ణోయ్ 2, దిగ్వేశ్ రాఠీ అవేశ ఖాన్ చెరో ఒక వికెట్ తీశారు. ఏకాగా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్ ‌కు అంత అనుకూలం కాదంటూ సాయి సుదర్శన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎల్ఎస్‌జీ ఛేదనలో విజయం సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో

ధోని పరువు తీసిన కేకేఆర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2025 | 05:56 PM