Harry Brook England Captain: ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా బ్రూక్
ABN, Publish Date - Apr 08 , 2025 | 04:43 AM
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్లకు హ్యారీ బ్రూక్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు. జోస్ బట్లర్ వైదొలిగిన నేపథ్యంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది

లండన్: ఇంగ్లండ్‌క్రికెట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు ఇక నుంచి హ్యారీ బ్రూక్ సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటన చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా జోస్ బట్లర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈనేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న 26 ఏళ్ల బ్రూక్‌కు వన్డే, టీ20 జట్ల పగ్గాలు అప్పగించారు. టెస్టు కెప్టెన్ స్టోక్స్‌కే పరిమిత ఓవర్ల కెప్టెన్సీని అప్పగిస్తారనే కామెంట్స్ వినిపించినా.. ఈసీబీ బ్రూక్ వైపు మొగ్గు చూపింది. 2022లో అరంగేట్రం చేసిన బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు.
Updated Date - Apr 08 , 2025 | 04:45 AM