క్వార్టర్స్‌లో హైదరాబాద్
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:35 AM
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న బీసీసీఐ మహిళల అండర్-23 వన్డేట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది....

బీసీసీఐ మహిళల వన్డే ట్రోఫీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న బీసీసీఐ మహిళల అండర్-23 వన్డేట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హిమాచల్‌ప్రదేశ్‌పై హైదరాబాద్ 108 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 8 వికెట్లకు 205 రన్స్ చేసింది. కెప్టెన్ మమత అర్ధ శతకం (76)తో రాణించింది. ఛేదనలో స్పిన్నర్ ధ్రుతి కేసరి (4/23) చెలరేగింది. హిమాచల్‌ప్రదేశ్ 32.4 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. ఈనెల 21న గువాహటిలో క్వార్టర్స్ జరగనుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 14 , 2025 | 03:35 AM