Ind Vs Eng: ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో భారత్ విజయం.. సిరీస్ కైవసం
ABN, Publish Date - Feb 09 , 2025 | 10:56 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచుల సిరీస్‌లో వరుసుగా రెండో విజయాన్ని అందుకుని ఓ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ సెంచరీకి తోడు సిరీస్ కూడా సొంతం కావడంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Ind Vs Eng Match: ఫామ్‌లోకి వచ్చిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌పై కళ్లుచెదిరే సెంచరీ!
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీం 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ దూకుడుగా ఆడి శుభారంభాన్ని ఇచ్చాడు. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులో 119 పరుగులు చేశాడు. 76 బంతుల్లోనే శతకం బాది పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఇక మరో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 5 పరుగులకే వికెట్ కోల్పోయినా శ్రేయాస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41*) టీంను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్ ఓవర్టన్ రెండు వికెట్లు తీసి టీమిండియాను నిలువరించే ప్రయత్నం చేసినా అంతిమంగా భారత్ విజయం దక్కించుకుంది.
IND vs PAK: టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..
ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ 56 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేశాడు జోరూట్ 72 బంతుల్లో 69 పరుగులు చేశాడు. హ్యారీ బుక్ 31 పరుగులు, ఫిల్ సాల్ట్ 26 పరుగులు జోస్ బట్లర్ 34 పరుగులతో ఇంగ్లాండ్ స్కోర్ 300 దాటింది భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్ తీసి ఇంగ్లాండ్ బ్యాటర్‌ల స్పీడ్ కు బ్రేకులు వేశాడు. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 09 , 2025 | 10:56 PM