భారత్‌.. ఒకేరోజు మూడు ఫార్మాట్లలో ఆడగలదు

ABN, Publish Date - Mar 14 , 2025 | 03:55 AM

భారత క్రికెట్‌లో అద్భుత ఆటగాళ్లకు కొదవ లేదని ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కొనియాడాడు. ‘ఒకే రోజు ఆసీ్‌సతో టెస్టును, ఇంగ్లండ్‌తో వన్డేను,...

భారత్‌.. ఒకేరోజు మూడు ఫార్మాట్లలో ఆడగలదు

సిడ్నీ: భారత క్రికెట్‌లో అద్భుత ఆటగాళ్లకు కొదవ లేదని ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కొనియాడాడు. ‘ఒకే రోజు ఆసీ్‌సతో టెస్టును, ఇంగ్లండ్‌తో వన్డేను, దక్షిణాఫ్రికాతో టీ20 ఆడి పోటీనివ్వగల సత్తా భారత జట్టుకు ఉంది. ప్రపంచంలో మరే జట్టుకూ ఈ అవకాశంలేదు ఐపీఎల్‌ ద్వారా వారికి నైపుణ్యం కలిగిన క్రికెటర్లు లభిస్తున్నారు. అందుకే చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ విజేతగా నిలవడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ దుబాయ్‌లో వారికి లబ్ధి చేకూరిందని చెప్పలేం. ఎందుకంటే భారత్‌ మినహా ఇతర దేశాల ఆటగాళ్లు ప్రపంచంలోని అన్ని వేదికల్లో జరిగే లీగ్‌ల్లో ఆడతారు. కానీ భారత ప్లేయర్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తారు’ అని స్టార్క్‌ తేల్చాడు.

ఇవీ చదవండి:

రోహిత్‌పై ధోనీకి ఎందుకంత కోపం

సీఎస్‌కే క్రేజీ రికార్డ్

అబిద్‌ అలీ కన్నుమూత

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2025 | 03:55 AM