ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kho-Kho World Cup : భారత్‌ బోణీ

ABN, Publish Date - Jan 14 , 2025 | 05:10 AM

ఖో-ఖో వరల్డ్‌క్‌పలో భారత్‌ శుభారంభం చేసింది. సోమవారం హోరాహోరీగా జరిగిన గ్రూప్‌-ఎ తొలి మ్యాచ్‌లో భారత్‌ 42-37తో నేపాల్‌పై గెలిచింది. తొలి టర్న్‌లో భారత్‌ 24 పాయింట్లు సాధించగా...

భారత అమ్మాయిల మార్చ్‌పాస్ట్‌

  • నేపాల్‌పై గెలుపు ఫ ఖో-ఖో వరల్డ్‌కప్‌

న్యూఢిల్లీ: ఖో-ఖో వరల్డ్‌క్‌పలో భారత్‌ శుభారంభం చేసింది. సోమవారం హోరాహోరీగా జరిగిన గ్రూప్‌-ఎ తొలి మ్యాచ్‌లో భారత్‌ 42-37తో నేపాల్‌పై గెలిచింది. తొలి టర్న్‌లో భారత్‌ 24 పాయింట్లు సాధించగా.. రెండో టర్న్‌లో నేపాల్‌ 20 పాయింట్లు స్కోరు చేసింది. ఇక మూడో టర్న్‌లో భారత్‌ 18 పాయింట్లు దక్కించుకోగా.. నాలుగో టర్న్‌లో నేపాల్‌ 16 పాయింట్లు మాత్రమే సాధించింది.

ఇందిరా గాంధీ స్టేడియంలో తొలి ఖో-ఖో వరల్డ్‌కప్‌ ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ జ్యోతి వెలిగించి టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఏరియల్‌ డ్యాన్స్‌లు ఆకట్టుకొన్నాయి. టోర్నీలో తలపడే జట్లు మార్చ్‌పా్‌స్టలో పాల్గొన్నాయి.


ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్‌ మాండవ్య, సహాయ మంత్రి రక్షా ఖడ్సే, ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష, ఎంపీ రాజీవ్‌ శుక్లా, భారత ఖో-ఖో సంఘం అధ్యక్షుడు సుదాన్షు మిట్టల్‌, గ్రేట్‌ ఖలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 05:10 AM