Share News

IPL 2025, GT vs RR: అండర్‌డాగ్స్ పోరులో విజేత ఎవరు.. గుజరాత్‌కు రాజస్తాన్ బ్రేక్‌లు వేస్తుందా

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:58 PM

గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో జోరుమీదుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్‌కు పరాజయమే లేదు. ఈ రోజు మరో అండర్‌డాగ్ జట్టు అయిన రాజస్తాన్‌తో తలపడబోతోంది.

IPL 2025, GT vs RR: అండర్‌డాగ్స్ పోరులో విజేత ఎవరు.. గుజరాత్‌కు రాజస్తాన్ బ్రేక్‌లు వేస్తుందా
GT vs RR

తాజా ఐపీఎల్ (IPL 2025) సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో జోరుమీదుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్‌కు పరాజయమే లేదు. ఈ రోజు మరో అండర్‌డాగ్ జట్టు అయిన రాజస్తాన్‌తో తలపడబోతోంది (GT vs RR). గుజరాత్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది.


ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ రెండింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఆరు సార్లు ఐపీఎల్‌లో మ్యాచ్‌లు జరిగాయి. వాటిల్లో గుజరాత్ టైటాన్స్ 5 సార్లు విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ కేవలం ఒక్కసారే గెలుపొందింది. ఈ రికార్డును ఈ రోజు తిరగ రాయాలని రాజస్తాన్ కృత నిశ్చయంతో ఉంది. సంజూ శాంసన్ రాకతో రాజస్తాన్ రాయల్స్ బలం పుంజుకుంది. గత మ్యాచ్‌లో బలమైన పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.


ఈ సీజన్‌లోని ఉత్తమ జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. గుజరాత్ టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్, గిల్, జోస్ బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. అలాగే మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌తో కూడిన బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు రాజస్తాన్ టీమ్‌లో సంజూ శాంసన్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ మంచి టచ్‌తో కనిపిస్తున్నారు. ఇక, జోఫ్రా ఆర్చర్, హసరంగ, సందీప్ శర్మ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.


తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్ (అంచనా): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

రాజస్తాన్ రాయల్స్ (అంచనా): సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్‌మేయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, యుద్వీర్ సింగ్, సందీప్ శర్మ

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 04:58 PM