Share News

IPL 2025, KKR vs SRH: వెంకటేష్ అయ్యర్ మెరుపు దాడి.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే

ABN , Publish Date - Apr 03 , 2025 | 09:13 PM

స్వంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా బ్యాటర్లు చెలరేగారు. ఆరంభంలో వికెట్ పారేసుకున్నా తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. అయితే రఘవంశీ (50) హాఫ్ సెంచరీతో పాటు వెంకటేష్ అయ్యర్ (38) వేగవంతమైన అర్ధశతకం చేయడంతో కోల్‌కతా కోలుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

IPL 2025, KKR vs SRH: వెంకటేష్ అయ్యర్ మెరుపు దాడి.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే
venkatesh iyer

స్వంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో కూడా కోల్‌కతా బ్యాటర్లు చెలరేగారు. ఆరంభంలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకున్నారు. అయితే రఘవంశీ (50) హాఫ్ సెంచరీతో పాటు వెంకటేష్ అయ్యర్ (29 బంతుల్లో 3 సిక్స్‌లు, 7 ఫోర్లతో 60) వేగవంతమైన అర్ధశతకం చేయడంతో కోల్‌కతా కోలుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.


బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. డికాక్ (1)ను ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్ (7)ను మహ్మద్ షమీ పెవిలియన్‌కు చేర్చారు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్‌కతాను రహానే, రఘవంశీ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఆ తర్వాత వెంట వెంటనే వీరిద్దరూ అవుటైపోయారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (60), రింకూ సింగ్ (32) వేగంగా బ్యాటింగ్ చేసి కీలకమైన పరుగులు చేశారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.


హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షమీ, అన్సారీ, మెండిస్, హర్షల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఆరంభంలో పరుగులు కట్టడి చేసిన హైదరాబాద్ బౌలర్లు స్లాగ్ ఓవర్స్‌లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా అయ్యర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో కోల్‌కతా భారీ స్కోరు నమోదు చేయగలిగింది. మరి, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలవాలంటే 201 పరుగులు చేయాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2025 | 11:01 PM