IPL 2025, LSG vs CSK: ఫలించిన చెన్నై వ్యూహం.. స్వల్ప స్కోరుకే పరిమితమైన లఖ్‌నవూ
ABN , Publish Date - Apr 14 , 2025 | 09:24 PM
వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లఖ్‌నవూ హార్డ్ హిట్టర్లను కట్టడి చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెన్నై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లఖ్‌నవూ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.

లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ (CSK vs LSG) జరుగుతోంది. వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లఖ్‌నవూ హార్డ్ హిట్టర్లను కట్టడి చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెన్నై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లఖ్‌నవూ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. అయితే పంత్ (63) అర్ధశతకం సాధించి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లఖ్‌నవూ బ్యాటర్లు అతి జాగ్రత్తగా ఆడారు. మొదటి ఓవర్లోనే మార్‌క్రమ్ (6), మంచి ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ (8) అవుట్ కావడంతో లఖ్‌నవూ జాగ్రత్తపడింది. మిచెల్ మార్ష్ (30) మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. ప్రమాదకరంగా మారుతున్న మార్ష్‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ పంత్ (49 బంతుల్లో 63) నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు.
ఆయుష్ బదోనీ (22), అబ్దుల్ సమద్ (20) కీలక పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేసి భారీగా పరుగులు రాకుండా నియంత్రించారు. అయితే పంత్ చివర్లో వేగంగా పరుగులు చేయడంతో లఖ్‌నవూ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. పతిరణ, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. మరి, బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఈ స్కోరును చెన్నై బ్యాటర్లు ఎలా ఛేదిస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..