IPL 2025, LSG vs CSK: హమ్మయ్య.. చెన్నై గెలిచింది.. లఖ్‌నవూపై విజయం
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:29 PM
వరుస పరాజయాలతో సతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చెన్నై కెప్టెన్ ధోనీ కీలక పరుగులు చేసి చెన్నైకు విజయాన్ని అందించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న లఖ్‌నవూ జోరుకు చెన్నై బ్రేకులు వేసింది.

వరుస పరాజయాలతో సతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చెన్నై కెప్టెన్ ధోనీ (26 నాటౌట్), శివమ్ దూబె (43 నాటౌట్) కీలక పరుగులు చేసి చెన్నైకు విజయాన్ని అందించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న లఖ్‌నవూ జోరుకు చెన్నై బ్రేకులు వేసింది. లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ (CSK vs LSG) జరిగింది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూపై చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లఖ్‌నవూ హార్డ్ హిట్టర్లను కట్టడి చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెన్నై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లఖ్‌నవూ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. అయితే పంత్ (63) అర్ధశతకం సాధించి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించాడు. మిచెల్ మార్ష్ (30) మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. ఆయుష్ బదోనీ (22), అబ్దుల్ సమద్ (20) కీలక పరుగులు చేశారు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు అదిరిపోయే ఆరంభం లభించింది. రచిన్ రవీంద్ర (37), రషీద్ (27) తొలి వికెట్‌కు 50 పరుగులకు పైగా జోడించారు. అయితే ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత చెన్నై గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. రాహుల్, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్ సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. అయితే శివమ్ దూబే (43), ఎంఎస్ ధోనీ (26) సమయోచితంగా ఆడుతూ చెన్నైను విజయ తీరాలకు చేర్చారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. మార్‌క్రమ్, దిగ్వేష్, ఆవేష్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..