Share News

IPL 2025, LSG vs CSK: చెన్నై vs లఖ్‌నవూ.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేయండి

ABN , Publish Date - Apr 14 , 2025 | 05:09 PM

లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు అటు బ్యాటింగ్, ఇటు స్పిన్, మరోవైపు పేస్ అటాక్ పరంగా చూస్తే చెన్నై జట్టు సమతూకంగా కనిపించింది. అంచనాలకు తగినట్టుగానే తమ తొలి మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసింది.

IPL 2025, LSG vs CSK: చెన్నై vs లఖ్‌నవూ.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లపై ఓ లుక్కేయండి
LSG vs CSK

తాజా ఐపీఎల్‌ (IPL 2025)లో తొలి స్టేజ్ ముగింపు (ఏడు మ్యాచ్‌లు) దశకు చేరుకుంటున్న దశలో చెన్నై పరాజయాలతో సతమవుతుంటే, లఖ్‌నవూ (LSG vs CSK) ఆత్మవిశ్వాస్వంతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట్లో ఓటమి పాలైన చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ సేన గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.


లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ (CSK vs LSG) జరగబోతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు అటు బ్యాటింగ్, ఇటు స్పిన్, మరోవైపు పేస్ అటాక్ పరంగా చూస్తే చెన్నై జట్టు సమతూకంగా కనిపించింది. అంచనాలకు తగినట్టుగానే తమ తొలి మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఓపెనర్లు రచిన్, కాన్వే విఫలమవుతున్నారు. కొద్దో గొప్పో రాణించిన రుతురాజ్ గాయం కారణంగా వైదొలగడం చెన్నై మిడిలార్డర్‌ను దెబ్బతీసింది. విజయ్ శంకర్, దీపక్ హుడా, జడేజా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.


ఇక, చివర్లో బ్యాటింగ్‌కు వస్తున్న ధోనీ కేవలం ఫ్యాన్స్‌‌ను ఉత్సాహ పరిచేందుకే ఆడుతున్నాడు. అటు బౌలింగ్‌లో కూడా చెన్నై జట్టు పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. మరోవైపు లఖ్‌నవూ జట్టుకు ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్ కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు రాణించి భారీ స్కోరు అందిస్తున్నారు. చివర్లో డేవిడ్ మిల్లర్ చెలరేగుతున్నాడు. పంత్ ఫామ్ మాత్రమే ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు.


తుది జట్లు:

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్

చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబె, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, అశ్విన్, కాంబోజ్, నూర్ అహ్మద్, పతిరణ

ఇవీ చదవండి:

రిటైర్మెంట్ ముచ్చటే లేదు

నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు: నాయర్

రోహిత్ మాటతో రిజల్ట్ తారుమారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 05:09 PM